రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసమే జగన్ పనిచేస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రంలో అనేక సమష్యలు ఉన్నాయి.రాష్ర్ట సమష్యల పరిష్కారం కోసం కేంద్రానికి సహకరిస్తూ ముందుకు వెళుతున్నాం అన్నారు ధర్మాన. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రజా సంక్షేమమే సిఎం జగన్ లక్ష్యం అన్నారు.
సంపూర్ణగృహ హక్కు గతంలో లేదు. ఎన్నో ఆలోచించి ఈ పథకం తెచ్చాం. ప్రతి ఒక్కరికీ నామినల్ వ్యయంతో నివాసానికి రిజిస్ర్టేషన్లు చేస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం. ఓటిఎస్ తో అమ్ముకోవడానికి , తనఖా , రిజిస్ర్టేషన్ కోసం అవకాశం ఉంటుందన్నారు. రైతులు కష్టకాలం ఉండటంతో ఉగాది వరకూ సిఎం జగన్ సమయం ఇచ్చారని దీనిని ప్రజలంతా ఉపయోగించుకోవాలన్నారు. మంచికార్యక్రమానికి ప్రతిపక్షం ప్రభుత్వానికి సహకరించాలి. రాజకీయలబ్ది కోసం ప్రజలకు నష్టం కలిగేపని చేయవద్దన్నారు.