తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఓటీఎస్ వసూళ్ల పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అంటూ ప్రకటనలతో జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు. జూనియర్ కిమ్ మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకోవడం లేదన్నారు చంద్రబాబు. ధరల నియంత్రణలో జగన్ విఫలమయ్యారు. రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పుల మయం చేశారు. పుట్టే ప్రతి బిడ్డ పైనా అప్పు చేస్తున్నారు. ఉపాధి హామీ…
రేపు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే.. రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు సీఎం జగన్. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించి అనంతరం…
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ పేదల మెడకు ఉరితాడులా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఉచిత రిజిస్ట్రేషన్‌లు కోరుతూ ఈ నెల 20, 23న నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కక్ష సాధింపు కోసమే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌పై బురద జల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రేమచంద్రారెడ్డి ఎండీగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్‌లో చెల్లింపులు జరిగాయని ఆయన అన్నారు. ఏపీలో రైతులు ఆందోళన చెందుతున్నారని రైతుల…
చంద్రబాబుకు వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహారిస్తే కనీస గౌరవం దక్కుతుంది అని సూచించారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే జగన్ 4 అడుగులు ముందుకు వేస్తున్నారు. కానీ జగన్ పాలనపై ప్రతిపక్షాలకు పిచ్చి ఎక్కి విమర్శలు చేస్తున్నాయి అని తెలిపారు. ఓటీఎస్ పేద ప్రజలకు ఓ వరం అని చెప్పిన రోజా… చంద్రబాబు 14 ఏళ్ళు…
ఓటీఎస్ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.. ముఖ్యంగా టీడీపీ ఈ విషయంలో వైసీపీ సర్కార్‌ను నిలదీస్తోంది… అయితే, విపక్షాలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు సీఎం వైఎస్ జగన్.. ఓటీఎస్ పథకం, గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా.. ఓటీఎస్ పథకం పై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.. ఓటీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి.. ఓటీఎస్ అన్నది పూర్తి స్వచ్ఛందం.. క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ జరుగుతుంది.. రూ.10వేల కోట్ల రూపాయల…
చంద్రబాబుకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్ పై విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు కు లేదని ఫైర్ అయ్యారు సజ్జల. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని.. సీఎం జగన్ చొరవతో ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. ఓటీఎస్ పై ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు కోరారంటే దాన్ని ఏమనాలో వారే ఆలోచించుకోవాలని చురకలు అంటించారు. ఓటీఎస్ పథకంలో పేదలకు నష్టం కల్గించేది అంటూ ఏదీ…
ఒన్ టైం సెటిల్మెంట్ పథకం పై ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో అవగాహన కార్యక్రమాల పై ఫోకస్ చేసింది వైసీపీ. ఒన్ టైం సెటిల్మెంట్ పథకం పై పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. దీనికి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాధరాజు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ… పేదలకు లబ్ది జరక్కుండా అపోహలు కల్గించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పచ్చమీడియా,…
వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం యొక్క రిజిస్ట్రేషన్ల ప్రక్రియ డిసెంబర్ 8వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నాం అని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకున్న వారికి డిసెంబర్ 21న సీఎం జగన్ డాక్యుమెంట్లను అందచేస్తారు. గత 30 ఏళ్ల నుంచి ఏపీ హౌసింగ్ కింద నిర్మాణాలు జరుగుతున్నాయి. 39 లక్షల ఇళ్లకు సంబంధించిన లబ్దిదారులు రుణం తీసుకుని ఇళ్లు కట్టుకున్నారు. వారి డాక్యుమెంట్లు ప్రభుత్వం వద్దే…