ఆదోని జిల్లా విషయంలో కొత్త డ్రామాకు తెర లేస్తోందా? సీఎం చంద్రబాబు సైతం పరిశీలించమని చెప్పినా…. మొత్తం మేటర్ని పక్కదారి పట్టించే ఎత్తుగడలు నడుస్తున్నాయా? కూటమిలో… అందులోనూ… తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి? అందరి అభిప్రాయాలకు భిన్నంగా మోకాలడ్డుతున్న ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరు? ఎందుకలా జరుగుతోంది? ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్న క్రమంలో… మెల్లిగా అది కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నట్టు కనిపిస్తోంది. వాళ్ల వ్యవహారం మొత్తం ఉద్యమాన్నే…
ముగ్గురు మంత్రులు, అదీ…. ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోల్లో ఉన్న వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది? మంత్రులు గ్లోబల్ సమ్మిట్ బిజీలో ఉంటే… అక్కడ లోకల్‌గా పార్టీ వ్యవహారాలను ఎవరు చక్కబెడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుపు వాతావరణం ఎలా ఉంది? లెట్స్ వాచ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. అలాగే…మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు అధికార పక్షానివే. కొత్తగూడెంలో మిత్రపక్షం సీపీఐ ఎమ్మెల్యే, అటు భద్రాచలంలో బీఆర్ఎస్…
పంచాయతీ పోరు ఆ ఎంపీలకు ప్రెస్టీజ్ ఇష్యూ అయిందా? అందుకే ఆఫర్స్ మీద ఆఫర్స్…. బంపరాఫర్స్ అంటూ పల్లె ఓటర్స్‌ను టెంప్ట్ చేస్తున్నారా? మేటర్ చివరికి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ హామీ దాకా వెళ్ళిపోయిందా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఏ పార్టీ ఎంపీలు అలా హామీల వరద పారిస్తున్నారు? తెలంగాణలో గ్రామ పంచాయతీ పోరు రసవత్తరంగా జరుగుతోంది. ఇవి పార్టీలకు అతీతమైన ఎన్నికలైనా, ఆ సింబల్స్‌తో సంబంధం లేకున్నా…. అన్ని పార్టీల కేడర్ హడావిడి మాత్రం తగ్గడం…
సాధారణంగా… సమ్మర్ హీట్‌లో సైతం కూల్‌కూల్‌గా కనిపించే ఆ కేంద్ర మంత్రి ఇప్పుడు ఇంత చలికాలంలోనూ ఎందుకు గరం గరంగా మారిపోయారు? ఓ జిల్లాకు జిల్లా పార్టీ నేతలు మొత్తాన్ని నిలబెట్టి కడిగేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? జిల్లా నాయకులు ఒకటి తలిస్తే… సెంట్రల్ మినిస్టర్ మరోటి అనుకున్నారా? ఎవరా మంత్రి? ఏ జిల్లా నాయకులతో ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్నారు? నల్లగొండ జిల్లా కమలం నేతలకు ఓ రేంజ్లో క్లాస్‌లు పడ్డాయట. సాధారణంగా ఎప్పుడూ సౌమ్యంగా…
ఆ మాజీ మంత్రి పార్టీ మారబోతున్నారా? ఇన్నాళ్ళు జగనన్నకు జై కొట్టిన ఆ చేతులు మరో పార్టీ జెండా పట్టుకోబోతున్నాయన్న ప్రచారంలో నిజమెంత? తరచూ నియోజకవర్గాలు మారుస్తూ తనతో పొలిటికల్ షటిల్ సర్వీస్ చేయిస్తున్నారన్న అసహనం ఆమెలో పెరుగుతోందా? నేను వైసీపీని వదలబోనని సదరు నేత చెబుతున్నా ప్రచారం మాత్రం ఎందుకు ఆగడం లేదు? లోగుట్టు ఏంటి? విడదల రజని….ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయిన లీడర్ కమ్ ఎక్స్ మినిస్టర్.…
మహిళల సొమ్ము కోట్లలో దండుకున్న దొంగలెవరు? బోగస్ గ్రూపులు పెట్టి లోన్లు తీసుకుని సొంత ఖాతాలకు మళ్ళించుకున్న దోపిడీ గాళ్ళకు ఆ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అండగా నిలబడుతున్నారా? అది కూటమిలో విభేదాల్ని పెంచుతోందా? ముఖ్య నేతలు ఇద్దరూ సీరియస్‌గా దర్యాప్తు జరిపించమని కోరుతుంటే… అసలు గోల్మాల్ గాళ్ళు ఎవరు? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏ నిధుల్ని కోట్లలో కొట్టేశారు? ఒంగోలు మెప్మాలో బోగస్ గ్రూపులు సృష్టించి కోట్లు స్వాహా చేసిన వ్యవహారం ఇప్పుడు స్టేట్ టాపిక్…
మీకో దండం సామీ…. ఆయన్ని కెలకొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ….. టీడీపీ పెద్ద లీడర్స్‌తో మొరపెట్టుకుంటున్నారట ఆ నియోజకవర్గ నాయకులు. మీరు వస్తారు, ఏదో మాట్లాడి వెళ్తారు, తర్వాత ఆయన అటాక్‌ని కౌంటర్ చేసుకోలేక మాకు తల ప్రాణం తోకకు వస్తోంది. ఏదన్నా చేయగలిగితే చేయండి, లేదంటే నోరు మూసుకోండి అని ఘాటుగానే అంటున్నారట. అధికార పార్టీకి అంత కొరకరాని కొయ్యలా మారిన ఆ లీడర్ ఎవరు? ఎక్కడుందా పరిస్థితి? వైసీపీ అత్యంత ముఖ్యమైన నాయకుల్లో ఒకరు…
పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. గాలివాటంలో గెలిచిన ఎమ్మెల్యే తీరు ఇలా కాకుంటే ఇంకెలా ఉంటుందిలే అంటూ... పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారట. వయసులో పెద్దవాడని, గతంలో ఆయనకు ఉన్న ట్రాక్
కారు పార్టీలో కొత్త పంచాయితీ మొదలైందా? బీఆర్ఎస్లో కొప్పుల కుమ్ములాట జరుగుతోందా? పార్టీ పెద్దలు పిలిచి నచ్చజెప్పాల్సిన స్థాయికి వెళ్ళిపోయిందా? ఇప్పటికీ సెట్ అవకుంటే… ఇక వార్నింగ్స్ అండ్ యాక్షన్ పార్టేనా? అసలేం జరిగింది గులాబీ మహిళా నేతల మధ్య? అధిష్టానం జోక్యం చేసుకోవాల్సినంత పెద్ద స్థాయిలో ఏమైంది? ఎప్పట్నుంచో ఉన్నాం…. ఇప్పుడొచ్చిన వాళ్ళు ఎక్స్‌ట్రాలు చేస్తే ఊరుకుంటామా అని ఓ వర్గం. ఎప్పుడొచ్చామన్నది కాదక్కయ్యా….! పోస్ట్ పడిందా..? అవతలోళ్ళకి పేలిందా అన్నదే ముఖ్యం అంటూ మరో…
పల్లెపోరు హస్తం పార్టీలో అగ్గి రాజేసిందా…? మరో మారు వర్గ పోరును బట్టబయలు చేసిందా? పాత, కొత్తగా విడిపోతున్న నేతలు పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తున్నారా? లోపం ఎక్కడుందో… సమస్య ఎవరి వల్ల వస్తోందో తెలిసినా… నోరెత్తలేని పరిస్థితులు పార్టీలో ఉన్నాయా? ఏయే నియోజకవర్గాల్లో అలా ఉంది? సమస్య ఎక్కడుంది? తెలంగాణ పల్లెల్లో పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాఖలైన, అవుతున్న నామినేషన్లను పరిశీలిస్తే… దాదాపు అన్నిచోట్ల పోటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్…