ఆ మాజీ మంత్రి రివర్స్ అటాక్ మొదలు పెట్టారా? ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే డిఫెన్స్‌లోకి నెట్టాలనుకుంటున్నారా? అందుకే వాయిస్ రెయిజ్ చేస్తున్నారా? ఆ విషయంలో గవర్నమెంట్ పెద్దలు ఏమనుకుంటున్నారు? ఇంకీ ఎవరా మాజీ మంత్రి? ఏ విషయంలో రివర్స్ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు హాట్ సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే….అది నకిలీ మద్యమే. దాన్ని బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ, అసలు అందులో ఉన్నది కూడా మీ వాళ్ళేనంటూ… విపక్షం నోరు మూయించాలని…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం భారీ స్థాయిలో నామినేషన్స్ దాఖలవడం దేనికి సంకేతం? అది ప్రభుత్వం మీద వ్యతిరేకతా? లేక తెర వెనక అదృశ్య శక్తులు ఉన్నాయా? నామినేషన్స్ వేసిన వందల మంది చివరిదాకా ఎన్నికల బరిలో ఉంటారా? ఒకవేళ ఉంటే లాభం ఎవరికి? నష్టం ఎవరికి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. నామినేషన్స్ దాఖలుకు చివరి రోజైతే…ఒక చిత్రమైన సీన్ కనిపించింది. నామినేషన్ వేసేందుకు వెల్లువలా తరలి వచ్చారు అభ్యర్థులు.…
భీమవరం డీఎస్పీ వ్యవహారశైలిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు? ఒక డివిజన్ అధికారి గురించి డిప్యూటీ సీఎం స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది కేవలం ఒక ఆఫీసర్‌కి సంబంధించిన వ్యవహారమేనా? లేక అంతకు మించి కూటమి పార్టీల మధ్య కుమ్ములాటల పర్యవసానమా? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కూటమి మూడు పార్టీల నేతల మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతున్నట్టుగా…
వైసీపీలో నిశ్శబ్దం పూర్తి స్థాయిలో బద్దలైపోయినట్టేనా? ఇన్నాళ్ళు అనుమానాలతో చూద్దాం, చేద్దాం అనుకున్న సీనియర్స్ కూడా ఇక యాక్టివ్ బటన్ ఆన్ చేసినట్టేనా? ఇప్పుడే ఎందుకు గేర్ మారుస్తున్నారు అంతా? ఇప్పటికీ గడప దాటకుంటే మీ కుర్చీల కిందికి నీళ్ళొస్తాయన్న వార్నింగ్స్ బలంగా పని చేశాయా? ఫ్యాన్ పార్టీలో అసలేం జరుగుతోంది? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తోంది. వైసీపీ కనీవినీ ఎరుగని ఘోర ఫలితాలను చూడటం, అధికార మార్పిడి జరిగాక మాజీ…
దీపావళి పూట టపాకాయలు పేలడం కామన్. కానీ… ఆ సీనియర్ లీడర్ మాత్రం తన అనుభవాన్నంతా రంగరించి… పేద్ద…టపాసులో మందుగుండును కూరి మరీ… రీ సౌండ్ వచ్చేలా పేల్చారట. కానీ… వెరైటీగా ఆ సౌండ్ ఒక్కో చోట ఒక్కోలా వినిపిస్తోంది. ఇన్నాళ్ళు….. ఈ అలక ఏదైతే ఉందో… అంటూ అలిగీ అలిగీ… ఆయనకే బోర్ కొట్టిందా? లేక రొటీన్‌కు భిన్నంగా కొత్త ప్లాన్ చేస్తున్నారా? ఎవరా సీనియర్? ఏంటి ఆయన తాజా రీ సౌండ్? జగిత్యాల కాంగ్రెస్…
ఆ టీడీపీ ఎమ్మెల్యే అన్నిటికీ తెగించేశారా? అల్రెడీ డమ్మీని చేసి కూర్చోబెట్టారు…. ఇప్పుడు మాట్లాడితే ఇంత మించి పోయేదేముందని భావించే నోటికి పని చెబుతున్నారా? డైరెక్ట్‌గా సొంత పార్టీ ఎంపీనే టార్గెట్ చేయడానికి కారణాలేంటి? ఎవరా ఇద్దరు నేతలు? వాళ్ళిద్దరి మధ్య గిల్లికజ్జాలు ఎంత దూరం వెళ్తున్నాయి? కొలికపూడి శ్రీనివాసరావు… ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టిడిపి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారాయన. కానీ… గెలిచినప్పటి నుంచి అధిష్టానానికి కంట్లో నలుసులా మారారరన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే ఉంది. శ్రీనివాసరావు…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ మీద వత్తిడి పెంచుతోందా? సిట్టింగ్ సీటు కాబట్టి ఎంతో కొంత సహజమే అయినా… ప్రస్తుతం అంతకు మించి అన్నట్టుగా వాతావరణం ఉందా? ఎందుకు కారు పార్టీ అంత ప్రెజర్లో ఉంది? తిరిగి పాగా వేసేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది? ఈ ఒక్క సీటును మళ్లీ గెల్చుకుంటే బీఆర్ఎస్కు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? లేదంటే జరిగే నష్టమేంటటి? తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలకు జూబ్లీహిల్స్ ఫీవర్ పట్టుకుంది. ఇక్కడ ఉప ఎన్నికల్లో…
చావుకు గొంతుంటే… ఇట్టా ఉంటదా…. అన్నది ఓ హిట్ సినిమా డైలాగ్. అదే డైలాగ్ ఇన్స్పిరేషన్గా రాజకీయ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నారో మాజీ ఎమ్మెల్యే. పాలిటిక్స్‌లో మంచితనం వర్కౌట్ అవదని, ఏదైనా సరే… భయంతోనే జరిగిపోవాలని తాజాగా జ్ఞానోదయం అయిందట ఆయనకు. ఎవరా మాజీ శాసనసభ్యుడు? సడన్‌గా ఎందుకు అంత వైల్డ్‌గా రియాక్ట్ అవుతున్నారు? కొంత మంది గట్టిగా అరిచి వార్నింగ్ ఇస్తారు….మరికొంతమంది కొట్టి చెబుతారు, ఇంకొందరు కొట్టినంత పని చేస్తారు. భయపెట్టడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.…
కొండాస్….పొలిటికల్ కుటుంబ కథాచిత్రానికి శుభం కార్డ్ పడ్డట్టేనా..? ఆ విధంగా వాళ్ళు సెట్ అయ్యారా? లేక పార్టీ పెద్దలు సెట్ చేశారా..!? కథకు ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి కాబట్టి పలికారా? లేక నిజంగానే వివాదం సమసి పోయిందా? ఇంతకీ ఎలా సెట్ చేశారు..? తెర వెనక ఏం జరిగింది? అసలు సమస్య ఒకటి…జరిగిన రచ్చ ఇంకొకటి. మొదలుపెట్టింది ఒకరు… బద్నాం అయ్యింది మరొకరు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ మీద ప్రభుత్వ చర్యతో…
ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడానికి ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలరు రాజకీయ నాయకులు. కానీ...ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు టీడీపీ నేతలు మాత్రం కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నారని సొంత కేడరే మాట్లాడుకుంటోంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 స్థానాలకుగాను 12 చోట్ల గెలిచినా... జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడం, గుర్తింపు ఉన్న ఏ ఇతర పదవులు రాకపోవడంతో...డీలా పడ్డారట జిల్లా టీడీపీ లీడర్స్.