తెలంగాణ స్పీకర్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలాంటి అడుగులు వెయ్యబోతున్నారు? స్పీకర్ ముందున్న కార్యాచరణ ఏంటి? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటివరకు నిర్ణయాన్ని ప్రకటించేశారు స్పీకర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ప్రస్తుతం పెండింగ్లో ఉంది. అనర్హత పిటిషన్ ల పై.. brs ఇప్పటికే సుప్రీంకోర్టు కి వెళ్ళింది. స్పీకర్ పై సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఇప్పటికే ఏడుగురు mla ల అనర్హత పిటిషన్ ల పై నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లిన స్పీకర్….ఇంకా ముగ్గురు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఐతే…రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని… సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే…ముగ్గురు MLA ల పిటిషన్ లపై ఇంకా నిర్ణయం పెండింగ్ లో ఉంది. వీటిపై వీలైనంత త్వరగా తేల్చాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భావిస్తున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి..దానం నాగేందర్ లు ఇప్పటికే స్పీకర్ కి ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు. అయితే…విచారణ జరపాల్సి ఉంది. ఇద్దరి పిటిషన్లపై త్వరలోనే నోటీసు ఇచ్చి విచారణ కి పిలిచే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్…ఇటు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి విచారణ తేదీని నిర్ణయించబోతున్నారు. విచారణ తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా దానం నాగేందర్, కడియం శ్రీహరిల పిటిషన్లపై ఆధారాలను బలంగా ప్రదర్శించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ నియోజకవర్గ నుంచి దానం నాగేందర్ పోటీ చేశారు. ఇది దానంకు మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పేందుకు కొంత అవకాశం తక్కువ. కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్‌కు ఓటేయాలని ప్రచారం చేశారు. కాబట్టి దీనిపై ఎలాంటి ఆధారాలను బీఆర్ఎస్ అందిస్తుంది అనేది చూడాలి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఒకేసారి నిర్ణయం ప్రకటిస్తారా .? లేదంటే సంజయ్ ది ముందే ప్రకటిస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి సుప్రీంకోర్టు కూడా రెండు వారాల గడువులోనే తేల్చాలని స్పష్టం చెయ్యడంతో పెండింగ్లో ఉన్న పిటిషన్ల విచారణలను మొదలుపెట్టే అవకాశం కనబడుతోంది.