ఆ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ… ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం తంటాలు పడుతున్నారా? అందుకే పార్టీని, లోకల్ ఎమ్మెల్యేని ఇరుకున పెడుతూ ఇష్టానికి కామెంట్స్ చేస్తున్నారా? గాంధీభవన్ పట్టించుకోకపోయేసరికి రోజుకోరకమైన సంచలన వ్యాఖ్యలతో అటెన్షన్ తనవైపు తిప్పుకోవాలనుకుంటున్నారా? పార్టీలో చేరిన కొత్తవాళ్ళని ఉద్దేశించి ఇక్కడేముందని వచ్చారంటూ కామెంట్ చేసిన ఆ కాంగ్రెస్ సీనియర్ ఎవరు? ఆ మాటల వెనక మర్మం అదేనా? జగిత్యాల పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. ఏడాది కాలంగా నివురుగప్పిన నిప్పులాగా ఉన్న రాజకీయాల్ని తన వ్యాఖ్యలతో ఓపెన్ చేస్తున్నారు సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి. తొలుత మూడుసార్లు అలకబూని పార్టీ పెద్దలను దిగివచ్చేలా చేసుకున్న మాజీ మంత్రి….ఇప్పుడిక పట్టించుకునే పరిస్థితి లేదని గ్రహించి సంచల వ్యాఖ్యలకు తెరతీసినట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. జీవన్‌ని వరుసగా రెండు సార్లు ఓడించిన డాక్టర్ సంజయ్‌కుమార్ కార్ దిగి కాంగ్రెస్ తీర్దం పుచ్చుకోవడంతో మొదలైన అసంతృప్తి ఇప్పుడిక తారాస్థాయికి చేరినట్టే కనిపిస్తోందట. దీంతో పెద్దలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్న ఆసక్తి పెరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. ఈ పరిస్థితుల్లో… ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల పార్టీలో చేరిన బీఎస్పీ నేత విజయ్‌ని ఉద్దేశించి కాంగ్రెస్‌లో ఏముందని చేరావు…. నాలాంటి వాళ్లకే ఇక్కడ దిక్కులేదు… నేనే బీఎస్పీలోకి వద్దామనుకున్నా అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు సొంత పార్టీనేతలతో సఖ్యంగా లేకుండా… ఇటు బహిరంగ వేదికల్లో పార్టీని విమర్శిస్తూ అంటున్న మాటలు హస్తం పెద్దలకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. నిన్నా మొన్నటి దాకా జీవన్‌రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని జగిత్యాలలో జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత క్యాబినెట్ హోదా ఖాయమని చెప్తూ వచ్చారు ఆయన అనుచరులు… కానీ పెద్దాయనకు పదవి దక్కలేదు… ఇక ఇప్పట్లో పదవి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
పదే పదే అలుగుతున్న పెద్దమనిషిని పార్టీ ముఖ్యులు లైట్ తీసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో జీవన్‌రెడ్డి పిక్చర్ క్లియర్‌గా అర్దమైందట…. అందుకే రూట్ మార్చి…. ఏదో ఒక సెన్సేషనసల్ కామెంట్‌తో అటెన్షన్ తనవైపునకు తిప్పుకునే ప్లాన్ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. జై బాపు- జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అక్కడ ఎమ్మెల్యే సంజయ్‌ని ఉద్దేశించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ కార్యకర్తలను వేధించినవారు ఈరోజు పార్టీలోకి వచ్చారు… రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారంటూ హాట్ హాట్‌గా మాట్లాడారాయన. జీవన్‌రెడ్డి వ్యాఖ్యలకు గట్టి కౌంటరే ఇచ్చారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్… ఆయన టీడీపీలో ఉండి ఇందిరమ్మను విమర్శించారని, ఆ తర్వాత కాంగ్రెస్‌లోనే చేరారంటూ గతంలోకి వెళ్ళారు. జగిత్యాల అభివృద్ది జీవన్‌రెడ్డి ఒక్కడి వల్లే కాలేదని… ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే ఎక్కువ కాలం ఉన్నారని అన్నారు సంజయ్… హత్యలు, కేసులు వేధింపులు తన నైజం కాదని… జగిత్యాల ప్రజలకు తానేంటో తెలుసని అందుకే రెండుసార్లు వరుసగా గెలిపించారని కౌంటర్ అటాక్ చేశారు. అయితే సుప్రీం కోర్టులో ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ వేగవంతం అయిన క్రమంలోనే జీవన్ దూకుడుగా మాట్లాడుతున్నారనే చర్చలు ఒకవైపు నడుస్తుండగా… అదేంకాదు… జీవన్‌రెడ్డిని గాంధీభవన్ పట్టించుకోకపోవడంతోనే ఆ ఫ్రస్ట్రేషన్ అన్నది ఇంకొందరి అభిప్రాయం. పార్టీ పెద్దలు తమంతట తాము పిలిచి మాట్లాడాలనే ప్రణాళికతోనే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. రోజు రోజుకు తన వ్యాఖ్యలతో అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ జీవన్‌రెడ్డి తనను తాను పలుచన చేసుకుంటున్నారని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట కాంగ్రెస్ కార్యకర్తలు. నలభై ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉండి పదవులు అనుభవించి ఇవే లాస్ట్ ఎన్నికలు అంటూ వెంటనే యూటర్న్ తీసుకుంటున్న జీవన్‌రెడ్డిలో ఇప్పటికీ పదవులపై ఆశ చావడం లేదని ప్రచారం చేస్తున్నారట సొంత పార్టీలోని ప్రత్యర్థులు. మొత్తానికి ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ అన్నట్టుగా మారిన వార్ ఏ టర్న్ తీసుకుంటుంది…. అలకల నుంచి గేర్ మార్చి పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్న జీవన్‌రెడ్డి వ్యవహారాన్ని పార్టీ ఎలా డీల్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.