నిలకడలేని రాజకీయం ఆ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కన పడేసిందా? ఆయన అనుభవం, గతాన్ని పరిగణనలోకి తీసుకుంటే… పరిగెత్తుకుంటూ రావాల్సిన అవకాశాలు ఎందుకు రావడం లేదు? ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఆయన వేడుకుంటున్నా… ఆ…. చూద్దాం లే…. అన్నట్టుగా ఎందుకు మారుతోంది? ఎవరా లీడర్? సుదీర్ఘ రాజకీయ అనుభవం పెట్టుకుని… అధికార భాగస్వామ్య పార్టీలో ఉండి కూడా అర్రులు చాచాల్సి రావడానికి కారణాలేంటి? కొత్తపల్లి సుబ్బారాయుడు….. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత. ఉమ్మడి…
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య ఓ వ్యవహారం నువ్వా నేనా అన్నట్టుగా నడిచిందా? ఎమ్మెల్సీ సీటు విషయంలో తండ్రీ కొడుకులిద్దరూ పరస్పరం పట్టుదలకు పోయారా? చివరికి కొడుకే తన పంతం నెగ్గించుకున్నారా? చివరికి కవిత ముందే చెప్పిన పేరు కూడా పక్కకు పోయిందా? ఎమ్మెల్సీ సీటు విషయమై కేసీఆర్, కేటీఆర్ మధ్య ఏం జరిగింది? గులాబీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి…
అక్కడ జనసేన వ్యవహారం ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా మారిపోయింది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిపోయింది. ఉమ్మడి జిల్లా మొత్తం మీద ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఒకవైపు అయితే… మిగతా పార్టీ నాయకులంతా మరో వైపు ఉన్నారట. ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఎక్కడ నడుస్తోంది జనసేన రాజకీయం? పార్టీ అధిష్టానం పట్టించుకుంటుందా? లేక మీ ఖర్మ అని వదిలేస్తుందా? లెట్స్ వాచ్. విజయనగరం జనసేనలో వర్గపోరు పీక్స్‌కు చేరుతోంది. ఎమ్మెల్యే…
కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కొత్త అవతారం ఎత్తబోతున్నారా? ఆయనకు పాలిటిక్స్ అంటే… విరక్తి కలిగిందా? అందుకే జగ్గన్న 2.0 అని అంటున్నారా? అసలేంటా 2.0? సీనియర్ పొలిటీషియన్ తీసుకున్న సడన్ డెసిషన్ ఏంటి? దాని రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ పాలిటిక్స్ చేసే అతికొద్ది మంది నాయకుల్లో జగ్గారెడ్డి ఒకరు. అలాంటి లీడర్‌కి ఇప్పుడు రాజకీయాల మీద విరక్తి కలిగిందా? అన్న ప్రశ్న చక్కర్లు కొడుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఆయన పాలిటిక్స్ నుంచి…
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అలకమీదున్నారా? కూటమి ప్రభుత్వం తనకిచ్చిన నామినేటెడ్ పోస్ట్‌తో సంతృప్తిగా లేరా? నా రేంజ్ ఏంటి?… నా ర్యాంక్ ఏంటి?… నేను పడ్డ కష్టం ఏంటి? వీళ్ళు నాకు ఇచ్చిన పోస్ట్ ఏంటంటూ… ఫైరైపోతున్నారా? ఏబీవీ విషయంలో ఏం జరుగుతోంది? అసలాయనేం కోరుకుంటున్నారు? ఏబీ వెంకటేశ్వరరావు….2014 టీడీపీ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయి పెత్తనం చెలాయించిన ఐపీఎస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్‌గా కంటే టీడీపీ సానుభూతిపరుడిగానే…
ఆ రెండు ఉమ్మడి జిల్లాలే తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల తలరాతల్ని నిర్ణయించబోతున్నాయా? మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికలు జరిగితే రెండు జిల్లాల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఏవా జిల్లాలు? ఏంటి వాటికున్న ప్రత్యేకత? ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇక ఫలితమే మిగిలి ఉంది. సాధారణ ఎన్నికలను తలపించిన ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది బరిలో ఉండగా రికార్డు స్థాయిలో…
అక్కడ నాయకులంతా మనం మనం బరంపురం అంటున్నారా? పార్టీ ఏదైతేనేం…. రాష్ట్ర స్థాయిలో వాళ్లు ఎలా కొట్టుకుంటే మనకెందుకు? జిల్లాలో మాత్రం కలిసుందామని అనుకుంటున్నారా? ఆగర్భ శతృవుల్లా వ్యవహరించే టీడీపీ, వైసీపీ నాయకులు సైతం ఇక్కడ అంత సీన్ లేదమ్మా అంటున్నారా? ఏ వివాదం తలెత్తినా టీ కప్పులో తుఫాన్‌లా రెండు రోజుల్లో చల్లారిపోతున్న ఆ జిల్లా ఏది? ఏంటి అక్కడి డిఫరెంట్ రాజకీయం? ఉమ్మడి కర్నూలు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మహామహుల్ని…
ఇవ్వాల్సిందే…. నాకు పదవి ఇవ్వాల్సిందే…. ఏం ఎందుకివ్వరు? ఉన్నోళ్ళు, జంప్ అయినోళ్ళు… అలా ఎవరెవరికో ఇచ్చేస్తున్నారు…. పార్టీని అంటిపెట్టుకుని వేలాడుతున్న నాకు ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేరా? ఇదీ… ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి వరస. ఇంతకీ ఎవరా నాయకుడు? అంత గట్టిగా డిమాండ్ చేయడం వెనకున్న రీజన్స్ ఏంటి? పొదెం వీరయ్య… భద్రాచలం మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉన్నారు. కానీ… ఆ సీట్లో అంత సంతృప్తిగా లేరట. అందుకే… నాకా…
నిర్మాత కేదార్‌ది సహజ మరణం కాదా? ఆయన చనిపోయినప్పుడు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పక్కనే ఉన్నారా? కేదార్‌కి, బీఆర్ఎస్ మాజీలకు ఉన్న లింకేంటి? ఆ టైమ్‌లో దుబాయ్‌లో ఆయన పక్కనే ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ ఎవరు? లెట్స్ వాచ్. టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి మరకలు గులాబీకి అంటుకుంటున్నట్టు కనిపిస్తోంది. మిస్టీరియస్ మరణాలు జరుగుతున్నాయని, అందులో డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మృతి కూడా ఒకటని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడంతో…
వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్స్. పైగా మాజీ మంత్రులు కూడా. కాలం కలిసి రాక… ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై… ఇప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బతిమాలుకుంటున్నారట. మరొక్కసారి పెద్దల సభలో అధ్యక్షా… అంటామని అడుగుతున్నా… ఓకే అని చెప్పలేని పరిస్థితి. ఏ లెక్కలు వాళ్ళకు అడ్డు పడుతున్నాయి? ఎవరా ఇద్దరు? ఏపీలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కసరత్తు చేస్తోంది కూటమి. ఈ క్రమంలోనే ఎప్పట్నుంచో ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు…