Off The Record: బీఆర్ఎస్ అధిష్టానం ఆ నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చిందా? లేక అంతర్గత పోరు బయటపడేట్టు చేసిందా? సిట్టింగ్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్ ఓపెనైపోయిందా? ఇక బస్తీమే సవాల్ సంగతేందో తేల్చుకుందామని ఎమ్మెల్సీ అంటున్నారా? ఇంతకీ ఎవరా ఇద్దరు? బీఆర్‌ఎస్ అధిష్టానం ఏం చేసింది?
Read Also: Off The Record: ఎమ్మెల్యే సంజయ్ మీద వాయిస్ పెంచుతున్న జీవన్ రెడ్డి
ఓపెన్ విత్ కేటీఆర్ బైట్ చారి గురించి చెప్పింది చిన్నగా ఈ మాటలే.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న ఈ మాటలే ఇప్పుడు భూపాలపల్లి కారులో తీవ్ర దుమారం రేపుతున్నాయట. మాజీ స్పీకర్ మధుసూదనాచారి సేవల్ని పార్టీ.. రాష్ట్ర స్థాయిలో వాడుకుంటుందని చెప్పడం ద్వారా.. తమ నాయకుడిని నియోజకవర్గానికి దూరం చేసినట్టు ఫీలవుతోందట ఆయన వర్గం. అదే సమయంలో.. అందర్నీ కలుపుకుని వెళ్ళాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి చెప్పడం పుండు మీద కారం చల్లినట్టు అయిందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న సమయంలో నియోజకవర్గం మీద పట్టు బిగించేందుకు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. పార్టీ ఓటమి తర్వాత ఇన్నాళ్ళ వ్యవహారాలు ఎలా ఉన్నా.. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వేదికగా ఎవరికి వారు తమను తాము నిరూపించుకోవాలనుకుంటున్నారట. అలాంటి టైంలో గండ్రకు బాధ్యతలు అప్పగిస్తూ.. పరోక్షంగా కేటీఆర్ చెప్పడం చారి వర్గానికి అస్సలు రుచించడం లేదు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న క్రమంలో.. కేటీఆర్‌ను నియోజకవర్గానికి రప్పించి ఇన్ఛార్జ్ తనేనని చెప్పించడంలో గండ్ర వెంకటరమణారెడ్డి సక్సెస్ అయినట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయవర్గాలు.
Read Also: Health Tips: యంగ్ గా, అందంగా కనిపించాలనుకుంటున్నారా?.. జస్ట్ ఈ పండ్లను డైట్ లో చేర్చుకోండి
అయితే, ఆయన వరకు అది సక్సెస్ అనిపిస్తున్నా.. ఓవరాల్‌గా నియోజకవర్గ పార్టీని మాత్రం చీల్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ పర్యటన తర్వాత కూడా ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గం తగ్గేదే లే అంటోందట. భూపాలపల్లి మీద పట్టు కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు మధుసూదనాచారి కుమారుడు ప్రశాంత్. ఇప్పుడు కేటీఆర్ ప్రకటన తర్వాత ఆ వర్గం మొత్తం ప్రశాంత్‌కి టచ్‌లోకి వెళ్ళి ఏదో ఒకటి చేయమంటూ వత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. అటు హైదరాబాద్‌లో ఉన్న చారి కూడా.. రెండు మూడు రోజుల్లో భూపాలపల్లి వస్తున్నా.. తొందరపడవద్దని తన వర్గానికి అభయం ఇచ్చారట. దీంతో ఈసారి అగ్గి గట్టిగానే రాజుకోవచ్చంటున్నారు. మరోవైపు కేటీఆర్ టూర్.. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శిబిరంలో జోష్ నింపింది. ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు చాలామంది కేటీఆర్ తాజా పర్యటనలో పాల్గొన్నారు. కానీ, మధుసూదనాచారి ఆచూకీ మాత్రం లేదు. దీనికి సంబంధించి ఆయనకు ఆహ్వానం లేదని, అందుకే హాజరవలేదని చెబుతోంది సిరికొండ వర్గం. అయితే, ఫ్లెక్సీల్లో కూడా కొన్నిచోట్ల ఆయన ఫోటో లేకపోవడాన్ని బట్టి చూస్తేనే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.
Read Also: Network : ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేసిన.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘నెట్‌వర్క్’
ఇక, నియోజకవర్గంలో గ్రూపుల నష్టం చేస్తున్నాయని కార్యకర్తలు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చిన సమయంలోనే.. గండ్ర అందర్నీ కలుపుకుని వెళ్లాలని సూచించారంటే… ఇక భూపాలపల్లి బాధ్యతలు ఆయనకు ఇచ్చేసినట్టేనని ఆయన వర్గం సంబరపడుతోంది. అదే సమయంలో.. మధుసూదనాచారి కూడా నియోజకవర్గ పర్యటనకు సిద్ధమవడంతో.. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆ తర్వాత ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నారు సెగ్మెంట్‌లో. వాస్తవానికి భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి రాజకీయ ప్రత్యర్థులు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గండ్ర.. మధుసూదనాచారి మీద గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి కారెక్కారాయన. ఒకప్పుడు ప్రత్యర్థులైన ఈ ఇద్దరు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా… పాత పగలు మాత్రం పోలేదని అంటున్నాయి గులాబీ వర్గాలు.
Read Also: BJP- Communist Party Alliance: కమ్యూనిస్టులకు బీజేపీ ఆహ్వానం.. కలిసి పని చేద్దాం!
అటు పార్టీ కూడా ఇద్దరికీ ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. ఆ ఓటమి తర్వాతే చారికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత పరిణామాలు మారిపోయాయి. గండ్ర మాజీ అయిపోగా.. మధుసూదనాచారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. క్యాడర్ సైతం పనుల కోసం ఆయన దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టింది. దాంతో భూపాలపల్లి బీఆర్‌ఎస్‌లో వర్గ పోరు పెరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న వెంకటరమణారెడ్డి… ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నారట. అదే సమయంలో మధుసూదనాచారి సైతం ఎమ్మెల్యే టిక్కెట్ రేస్‌లోకి వచ్చారు. అలా.. పరస్పరం పైచేయి కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో లోకల్ బీఆర్‌ఎస్ రెండుగా చీలిపోతోంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు… ఇక బయట పడుతుండటంతో… ఇది ఎందాక వెళ్తుందోనని ఆందోళనగా ఉన్నాయి లోకల్ గులాబీ వర్గాలు.