పాఠశాలలు, గురుకులాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ సేఫ్టీ కమిటీలు పరిశీలించనున్నాయి.
ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉంది. అధిక కాలుష్యంతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను వేర్వేరు సమయాల్లో తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటాయి.
ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ఇకపై 10-12 తరగతులు కూడా ఆన్‌లైన్‌లో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఫిజికల్ మీడియం ద్వారా పాఠశాలకు వెళ్లేవారు. అలాగే.. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ప్రజారోగ్య మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చాలాకాలంగా ప్రభుత్వ ఆమోదం కోసం మాజీ డీహెచ్ శ్రీనివాసరావు వేచి చూస్తుండగా.. ఈ క్రమంలో.. ఆయన వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించింది.
వధువు విషయంలో కేరళలోని ఒక జిల్లా వినియోగదారుల కోర్టు మ్యాట్రిమోనీకి షాకిచ్చింది. ఒక వ్యక్తికి వధువును కనుగొనడంలో విఫలమైనందుకు మ్యాట్రిమోనీ సైట్‌ను బాధ్యులను చేయడమే కాకుండా దానికి రూ. 25,000 జరిమానా కూడా విధించింది. అంతే కాకుండా బాధితుడి ఖర్చు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గోవులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే జంతూ వధ చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ క్రమంలో.. మూడు కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్ట్ లు పెట్టామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే గోవుల తరలింపు పై 60 కేసులు నమోదు చేశామన్నారు. ఇంతకుముందు చాలాసార్లు…
సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై రివ్యూ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ధి…
రైతుపై దాడి చేసి చంపిన పులిని చంపాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రాణాంతక చర్యలను ఆశ్రయించే ముందు పులి నరమాంస భక్షకమని అధికారులు నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.
ఏపీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. దసరా కానుకగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.