కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. భారత్ వ్యాక్సినేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పంపిణీ చేస్తోంది.. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు కూడా కావడంతో.. శుక్రవారం దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది.. ఒకే రోజు ఏకంగా 2.50 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.. కోవిన్ పోర్టల్ సమాచారం ప్రకారం రాత్రి 12 గంటల వరకు వేసిన డోసుల సంఖ్య 2.5 కోట్లు దాటేసింది.. ఇక, ఒక రోజులో కోటికి పైగా వ్యాక్సిన్ డోసులు అందించడం గత 22 రోజుల్లో ఇది నాలుగో సారి కావడంఓ మరో విశేషం.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వేసిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 79.33ను కూడా దాటేసింది.. ఇక, ఈ నేథప్యంలో ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ సెటైర్లు వేశారు.. దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిందన్న ఆయన.. నిన్న నిమిషానికి 26 వేల మందికి వ్యాక్సినేషన్ వేశామని.. ఒకేరోజు 2.50 కోట్ల డోసులు ఇవ్వడం అతిపెద్ద విజయంగా తెలిపారు.. ఇక, ఈ రికార్డుతో విపక్షాలకు జ్వరం పట్టుకుందని చురకలు అంటించారు ప్రధాని మోడీ. మరోవైపు.. కోవిడ్ సమయంలో దెబ్బతిన్న పర్యాటకానికి గోవా పునరుత్తేజం నింపిందని తెలిపారు ప్రధాని మోడీ.