ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటే రోటీ తినండి.. లేకుంటే బుల్లెట్ ఉందని పాకిస్థాన్‌ను ప్రధాని మోడీ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి సోమవారం గుజరాత్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత భుజ్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. పాకిస్థాన్ ప్రజలు.. ఉగ్రవాదం నుంచి బయటపడాలని.. అందుకోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పౌక్ పౌరులు.. ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ప్రశ్నించాలన్నారు. భారత్‌లో అభివృద్ధిలో దూసుకెళ్తుంటే.. పాకిస్థాన్‌లో ఉగ్రవాదంపై అడుగులు వేస్తోందని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Emmanuel Macron: 25 ఏళ్ల పెద్దదైన టీచర్‌తో ఫ్రెంచ్ అధ్యక్షుడి ప్రేమ పెళ్లి.. భార్య కూతురు మక్రాన్ క్లాస్ మేట్..
ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయని చెప్పారు. త్రివిధ దళాల ధైర్యం కారణంగానే పాకిస్థాన్ తెల్లజెండా ఎగురవేసిందన్నారు. భారత్ లక్ష్యం ఉగ్రవాదంపైనే అన్నారు. తప్పు చేస్తే.. దానికి పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ మానవాళిని కాపాడటానికి.. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి అని చెప్పారు. భారతీయుల రక్తాన్ని చిందించడానికి ప్రయత్నిస్తే ఎవరికైనా వారి స్వంత భాషలోనే సమాధానం ఉంటుందని పేర్కొన్నారు. భారత్‌కు హాని తలపెట్టాలని ఆలోచిస్తే.. వారిని అంతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. భారత్ పర్యాటకాన్ని నమ్ముకుందని.. పాకిస్థాన్ ఏమో ఉగ్రవాదాన్ని పర్యాటకం భావిస్తోందని ఆరోపించారు. ఇది ప్రపంచానికే ముప్పు అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Macron: ఎప్పుడూ సరదాగా చేసినట్టే చేసింది.. పోట్లాటపై ఫ్రెంచ్ అధ్యక్షుడు క్లారిటీ
సిందూర్ అనేది వివాహానికి సంకేతమని.. దానిని తుడిచివేయడం అంటే వైధవ్యాన్ని సూచిస్తుందన్నారు. మన సోదరీమణుల నుదిట నుంచి దాన్ని తుడిచేసే ధైర్యం చేసిన వాళ్లను ఖతం చేశామని చెప్పారు. ఇక మోడీని ఢీకొట్టడం ఎంత కష్టమో ఉగ్రవాదులు కూడా కలలో ఊహించి ఉండకపోవచ్చన్నారు. మన త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని.. దీంతో ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచం చూడని విధంగా అద్భుతాలు సృష్టించారని ప్రశంసించారు.
భారతదేశం పట్ల దాయాది దేశం పట్ల ద్వేషం కక్కుతోందని.. భారత్‌కు హాని చేయాలనే పాకిస్థాన్ కోరుకుంటోందని తెలిపారు. భారత్ లక్ష్యం పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధిని పెంపొందించడం, అభివృద్ధిని చెందిన దేశంగా మార్చడమే లక్ష్యమని చెప్పారు. ఇక వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకెళ్లడమే ప్రభుత్వ విధానమని చెప్పారు. హోలీ, దీపావళి, గణేష్ పూజ వంటి పండుగల సమయంలో భారతదేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేసి ఉపయోగించాలని ప్రజలను మోడీ కోరారు. విదేశీ దిగుమతులను కొనుగోలు చేయడం మంచిది కాదని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వదేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేసేందుకు సంకల్పించుకోవాలని కోరారు.
ఇక అంతకముందు వడోదర విమానాశ్రయం నుంచి నగర శివార్లలోని వైమానిక దళ స్టేషన్ వరకు మోడీ రోడ్ నిర్వహించారు. స్వాగతం పలికిన జనంలో కల్నల్ ఖురేషి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్‌లో పలు చోట్ల వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి. అయితే పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.