Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samuk: అక్షయ్ కుమార్ ఈ సారి సరికొత్త జానర్‌ను ఎంచుకున్నారు. ఏలియన్ థ్రిల్లర్ ‘సముక్’ తో కొత్త ప్రయోగం చేయబోతున్నారు. లండన్‌లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుండగా, దాదాపు 90 శాతం షూటింగ్ అక్కడే జరగనుంది. మిగిలిన భాగాన్ని ముంబైలో తెరకెక్కించనున్నారు. అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ‘సముక్’ ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలియన్ థ్రిల్లర్ జానర్ ఇండియన్ సినీ హిస్టరీలో అరుదుగా కనిపించడంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. దర్శకుడు కనిష్క్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ను నిరంతర షెడ్యూల్లో పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 23న లండన్‌లో ప్రారంభం కానుంది. చిత్రీకరణలో సుమారు 90 శాతం లండన్‌లోనే జరగనుండగా, మిగిలిన సన్నివేశాలను ముంబైలో తెరకెక్కించనున్నారు. విదేశీ లొకేషన్లతో పాటు, విజువల్ ఎఫెక్ట్స్, ఏలియన్ డిజైన్ ఈ సినిమాకు కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భారతీయ ప్రేక్షకులకు కొత్త తరహా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను అందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఇక ‘సముక్’కు విపుల్ అమృత్లాల్ షా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్షయ్ కుమార్, విపుల్ గతంలో ‘ఆంఖేన్’, ‘వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైమ్’, ‘నమస్తే లండన్’, ‘సింగ్ ఈజ్ కింగ్’, ‘యాక్షన్ రిప్లే’ వంటి సినిమాల కోసం కలిసి పనిచేశారు. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయి.
Also Read
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
- Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న 'ఆపరేషన్ గంగా'
ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. దీంతో ఏలియన్ డిజైన్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు హైలెట్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది. కథలో సస్పెన్స్, థ్రిల్‌తో పాటు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడంపై మేకర్స్ దృష్టి పెట్టబోతున్నారు. ఇప్పటికే ఇలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమాలకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. హృతిక్ ‘క్రిష్’ అయితే సంచలనాలే క్రియేట్ చేసింది. అయితే అక్షయ్ ఈ క్రేజీ కాన్సెప్ట్ తో ఎలా మెప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు అక్షయ్ కుమార్ చేతిలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆర్.డి. బర్మన్ బయోపిక్‌తో పాటు ‘గోల్మాల్ 5’ కూడా ఆయన లైనప్‌లో ఉంది. ప్రస్తుతం అక్షయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ‘హైవాన్’ సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. అయితే వీటన్నింటిలో ‘సముక్’ మాత్రం ఏలియన్ థ్రిల్లర్ కావడంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. లండన్‌లో ప్రారంభమయ్యే షూటింగ్‌తో ఈ సినిమా కథ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది.
- Tags
- Akshay Kumar
- cinema
తాజావార్తలు
-
Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
-
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్‌నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
-
BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
-
Sardar 2: ‘స్పైడర్’లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
-
Secunderabad Army : ఆర్మీ ఆయుధాల మిస్సింగ్ కేసు.. ఐదు రోజులు గడిచినా మిస్టరీనే.!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!