Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కాకరేపుతున్నాయి.. సమావేశాల ఆరంభం నుంచి ప్రతీరోజూ విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు అట్టుడుకుతున్నాయి.. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జ్‌పై అమిత్‌షా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షలు.. అయితే, నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నిరసనల అంశంపై పార్లమెంటులో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రభుత్వానికి దాచడానికి ఏమీ లేదని, ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పార్లమెంటు కార్యకలాపాలను సజావుగా సాగనివ్వాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి చర్చకు సిద్ధం
నీట్ పేపర్ లీక్, జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన లాఠీచార్జికి సంబంధించి ప్రతిపక్షాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వివరణ కోరుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ, ప్రతిపక్షాలు మధ్యాహ్నం 2 గంటలలోపు స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని అమిత్ షా సూచించారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తాను స్వయంగా చర్చలో పాల్గొంటానని స్పష్టం చేశారు.
Also Read
- Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
‘ప్రభుత్వానికి దాచడానికి ఏమీ లేదు’
నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు సంబంధించి ప్రభుత్వానికి దాచడానికి ఏమీ లేదని అమిత్ షా అన్నారు. ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశంపై చర్చకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. అయితే పార్లమెంటు కార్యకలాపాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడం సరికాదని అన్నారు. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను క్రమం తప్పకుండా పార్లమెంటుకు హాజరవుతున్నానని అమిత్ షా పేర్కొన్నారు.
పార్లమెంటు నిబంధనల ప్రకారమే చర్చ
పార్లమెంటులో ఏ అంశంపై చర్చించాలన్నా నిర్దిష్టమైన నియమ నిబంధనలు ఉంటాయని అమిత్ షా తెలిపారు. ఇంత తీవ్రమైన అంశాన్ని కేవలం ఒక ప్రకటన ద్వారా చర్చించలేమని చెప్పారు. పార్లమెంటులో ఏ అంశాన్నైనా వివరంగా చర్చించే అవకాశం ఉందని, ప్రభుత్వం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే, స్పీకర్ అనుమతిస్తే ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేసి కూడా చర్చకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమిత్ షా తెలిపారు.
నిర్ణయం ప్రతిపక్షాలదే
నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నిరసనలు, లాఠీచార్జి వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన అమిత్ షా.. ఇప్పుడు చర్చ జరగాలా వద్దా అనేది ప్రతిపక్షాలే నిర్ణయించుకోవాలని అన్నారు. పార్లమెంటు ప్రజా సమస్యలపై చర్చించేందుకు వేదిక అని, అందువల్ల సభ కార్యకలాపాలను అడ్డుకోకుండా చర్చకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. నీట్ అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా..
తాజావార్తలు
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్‌లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్‌లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!