సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ ఘటనలు ఎక్కువై పోతున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించుకునేందుకు కొందరు వ్యక్తులు అడ్డదార్లు తొక్కుతూ అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. నకిలీ పోలీసు అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్ళు గురుగ్రామ్‌లో నివసిస్తున్న 70 ఏళ్ల మహిళను డిజిటల్‌గా అరెస్టు చేశారు. ఆమె బ్యాంక్ ఖాతా, ఫోన్ నంబర్‌ను మనీలాండరింగ్ కోసం ఉపయోగించావని బెదిరించారు. ఆమె ఖాతాలను తనిఖీ చేసే పేరుతో నిందితులు రూ. 78,89,000 బదిలీ చేశారు. తన డబ్బు తిరిగి…
Cyber Crime: పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దోచుకున్న గ్యాంగ్‌ను భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యుల ఈ ముఠా, ఆధునిక సైబర్ ట్రిక్స్‌తో ప్రజలను మోసగిస్తూ భారీ మొత్తంలో డబ్బును దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
Aditi Rao Hydari : టాలీవుడ్, బాలీవుడ్‌లలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ అదితి రావు హైదరీ తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న మోసంపై గట్టిగా స్పందించింది. తన పేరు, తన ఫోటోలను ఉపయోగిస్తూ ఒక వ్యక్తి నకిలీ సోషల్ మీడియా అకౌంట్‌లను క్రియేట్ చేసినట్టు అదితి వెల్లడించారు. ఈ మధ్య సెలబ్రిటీల ఫొటోలు, పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే కదా.…
బర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బిగ్ ఆపరేషన్ చేపట్టారు. నగరంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు దాదాపు నెలరోజుల పాటు ప్రత్యేక దర్యాప్తు, ఆపరేషన్ నిర్వహించారు.
Nude Calls : ఈజీ మనీ కోసం అడ్డదార్లు దొక్కుతున్నారు కొందరు అక్రమార్కులు. అమాయక ప్రజలను మోసం చేస్తూ లక్షల్లో సంపాదించేందుకు ప్లాన్ వేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో వెలుగు చూసిన చామెట్ యాప్ న్యూడ్ కాల్స్, అసభ్య చాటింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. చామెట్ యాప్ తో మహిళలు పక్కదారి పడుతున్నారంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ చామెట్ యాప్ పేరుతో డబ్బులకు న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నట్టు తేలింది.…
బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ సీఐడీ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. ఏకకాలంలో 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 8 మంది బెట్టింగ్ యాప్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారులు ఉన్నారనే విషయాన్ని గమనించిన సీఐడీ వారికోసం వేట సాగిస్తోంది. మరోవైపు చిత్తూరు జిల్లాలో కేవలం ఇంటర్ చదివి ఓ యువకుడు బెట్టింగ్ యాప్ రూపొందించాడు. కోట్లకు పడగలెత్తాడు. కానీ చివరికి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతను బెట్టింగ్ యాప్స్…
హైదరాబాద్ నగరంలో మరోసారి సైబర్ మోసం వెలుగుచూసింది. 52 ఏళ్ల వయసు గల ఓ పురోహితుడు నేరగాళ్లకు బలై, లక్షల రూపాయలు కోల్పోయాడు. పాతబస్తీ పురానాపూల్ ప్రాంతానికి చెందిన ఈ పురోహితుడిని సైబర్ దుండగులు పూజ పేరుతో మోసం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది.
Cyber Crime : దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ మోసం బయటపెట్టారు. విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శ్రవణ్ కుమార్ను అరెస్ట్ చేశారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే అతను 500 కోట్ల రూపాయల భారీ నగదు లావాదేవీలు జరిపినట్టు విచారణలో తేలింది. పోలీసుల దర్యాప్తులో, శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్స్ సృష్టించి, వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీ చేసినట్టు వెల్లడైంది.…
UPI Payments: మీరు యూపీఐ యాప్‌లు ఉపయోగిస్తున్నారా? అయితే ఈ మార్పుల గురించి తప్పక మీరు తెలుసుకోవాల్సిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి యూపీఐలోని పర్సన్-టు-పర్సన్ (P2P) ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్‌కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్‌లో ఉంటున్న…