UPI Payments: మీరు యూపీఐ యాప్‌లు ఉపయోగిస్తున్నారా? అయితే ఈ మార్పుల గురించి తప్పక మీరు తెలుసుకోవాల్సిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి యూపీఐలోని పర్సన్-టు-పర్సన్ (P2P) ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ ఫీచర్ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి డబ్బు అడగడానికి, బిల్లులు షేర్ చేసుకోవడానికి ఉపయోగపడేది. కానీ, ఇటీవల సైబర్ మోసగాళ్లు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో నకిలీ పేమెంట్ రిక్వెస్ట్‌లు పంపి, వినియోగదారులకు తెలియకుండానే లావాదేవీలు జరుపుతున్నారు.
Read Also: Allu Aravind: ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. బడా నిర్మాత సంచలన కామెంట్స్!
ఇక, NPCI ఇప్పటికే ట్రాన్సాక్షన్ పరిమితిని రూ. 2 వేలకు తగ్గించినప్పటికీ, మోసాలు తగ్గకపోవడంతో.. కస్టమర్ల భద్రత కోసం, యూపీఐపై నమ్మకాన్ని కాపాడుకునేందుకు ఈ ఫీచర్‌ను దశలవారీగా నిలిపివేయాలని ప్లాన్ చేస్తుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ఐఆర్‌సిటిసి లాంటి ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగించే మెర్చంట్ కలెక్ట్ రిక్వెస్ట్‌లు మాత్రం కొనసాగుతుందని వెల్లడించింది. వీటికి వినియోగదారుల ఆమోదం, యూపీఐ పిన్ తప్పనిసరి చేసింది.
Read Also: Alaska sale history: అమెరికాకు అలస్కా బేరం.. ఎంతకు అమ్మారంటే..?
అయితే, ఇక నుంచి మీరు డబ్బులు పంపించాలంటే QR కోడ్ స్కాన్ చేయాలి, లేదా రిసీవర్ యూపీఐ ఐడీ / ఫోన్ నెంబర్ నమోదు చేసి, పిన్ ద్వారా లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. కాగా, అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్లీజ్ పే మీ రిక్వెస్ట్ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండదు. అయితే, వినియోగదారులు ఈ మార్పులను గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. ముఖ్యంగా, మీ ఫోన్‌ను ఇతరులకు ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎందుకంటే అది మోసాలకు దారి తీసే అవకాశం ఉంది.