వృద్ధుడికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వృద్ధుడి నుంచి రూ. 74.36 లక్షలు కాజేశారు. బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులు పంపి పెట్టుబడి పెట్టమని చెప్పి భారీగా మోసానికి పాల్పడ్డారు.
ఆ వ్యక్తి వయసుల 70 ఏళ్లు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన ఈ వయసులో దుర్భుద్ధి ప్రవేశపెట్టాడు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి 38.73లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. హైదరాబాద్ కి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(70)ని హనీ ట్రాప్‌లో ఇరికించి రూ. 38.73లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్ళు.
Cyber Fraud : 70 ఏళ్ల ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి అనగానే.. జీవితంలో చాలా అనుభవాలున్న పెద్దమనిషి అనిపించాలి కదా.. కానీ డిజిటల్ మోసాలకి వయస్సు అడ్డుకాదన్నట్టు, ఫేస్‌బుక్‌లో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో అతని విశ్రాంత జీవితం తలకిందులైంది. వివరాల్లోకి వెళ్తే, ఈ రిటైర్డ్ ఉద్యోగికి ఓ యువతి ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. తాను పేద కుటుంబానికి చెందినవని చెప్పి వైఫై కనెక్షన్ కోసం రూ.10,000 సహాయం అడిగింది. మానవత్వంతో స్పందించిన బాధితుడు డబ్బులు పంపించడంతో…
Cyber Fraud : సైబర్ నేరాలు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నిత్యం కొత్త రూపాల్లో మోసాలు చేస్తూ ప్రజలను దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు మరో స్థాయికి వెళ్లారు. తాజాగా సుప్రీం కోర్టు జడ్జి పేరు వినిపిస్తూ నకిలీ కోర్టు డ్రామాతో ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను మోసం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ మాజీ చీఫ్ ఇంజనీర్‌కు ఓ వీడియో కాల్ వచ్చింది.…
Cyber Crime: సైబర్ నేరగాళ్ల నుంచి 5.80 లక్షల రూపాయలు రికవరీ చేయడంలో కామారెడ్డి పట్టణ పోలీసులు విజయవంతమయ్యారు. ఇటీవల కామారెడ్డికి చెందిన రాజేందర్‌కు ఓ అనామక నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్‌లో మాట్లాడిన వ్యక్తులు ముంబై పోలీసులమని పరిచయం చేసుకున్నారు. రాజేందర్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదైందని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను తాము చెప్పిన ఖాతాకు వెంటనే బదిలీ చేయాలని, లేకపోతే అరెస్ట్ అవుతావని హెచ్చరించారు.…
Cyber Fraud : సమాజంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, దాన్ని అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడే నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. ఇటీవలి కాలంలో కరెంట్ బిల్లు పెండింగ్ ఉందంటూ ప్రజలను మోసం చేసే సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది. సైబర్ నేరగాళ్లు బాధితులకు మెసేజ్ పంపుతూ, “మీ కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈరోజు సాయంత్రం లోగా చెల్లించకపోతే మీ ఇంటికి కరెంట్…
ఫేస్ బుక్ బ్రౌజింగ్ లో వాట్సప్ గ్రూప్ ద్వారా నిందితులు ఆకర్షిస్తున్నారు.. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి రూ. 93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ చేశారు అని ఆయన తెలిపారు. మరో బాధితుడు విడతల వారికి రూ. 2.06 డబ్బును కోల్పోయాడు. అనీషా యాప్ ద్వారా వాట్సప్ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు.. మ్యూల్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకు అధికారుల సహకారంతో ఫ్రాడ్ చేస్తున్నారు అని సీపీ ఆనంద్ చెప్పుకొచ్చారు.
Cyber Scams: ఇటీవల సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త ఆఫర్లు, ప్రభుత్వ పథకాలు, పండుగలు, ఉచిత రీఛార్జ్‌ల పేరుతో ప్రజలకు ఇ-మెయిల్, మెసేజ్‌ల రూపంలో లింక్స్‌ను పంపిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అలా వారి పంపించిన వాటిని ఓపెన్ చేసిన కొందరికి వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. సైబర్ క్రైం పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దని హెచ్చరిస్తున్న.. ఏదో రకంగా అమాయక…
Online Fraud: చ్చత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్‌పూర్ జిల్లాలో ఓ వైద్యుడు ఆన్లైన్లో సుమారు రూ.89 లక్షల మోసానికి గురి అయ్యాడు. మొదట గేమింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే 40 శాతం లాభం ఇస్తానని నిందితుడు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత దుండగులు రూ.88 లక్షల 75 వేలు డాక్టర్ నుండి దోపిడీ చేశారు. నిందితులు దాదాపు 40కి పైగా వాయిదాల్లో వైద్యుడి నుంచి డబ్బులు తీసుకుని ఆ తర్వాత అసలు ఆ సొమ్ము కూడా తిరిగి ఇవ్వలేదు.…
రిలయన్స్ జియో హెచ్చరికలు జారీ చేసింది. జియో తన పేరుతో జరుగుతున్న మోసానికి సంబంధించి ఈ వార్నింగ్ ఇచ్చింది. జియో పేరుతో ప్రజలను మోసాలకు గురిచేస్తున్నారని కంపెనీ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో టెలికాం కంపెనీ జియో మొబైల్ వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చింది.