Cyber Crime : దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ మోసం బయటపెట్టారు. విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శ్రవణ్ కుమార్ను అరెస్ట్ చేశారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే అతను 500 కోట్ల రూపాయల భారీ నగదు లావాదేవీలు జరిపినట్టు విచారణలో తేలింది. పోలీసుల దర్యాప్తులో, శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్స్ సృష్టించి, వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీ చేసినట్టు వెల్లడైంది. సైబర్ లింకుల ద్వారా వచ్చిన డబ్బులను ఈ అకౌంట్లలోకి మార్చి, అనంతరం మరికొన్ని ఫేక్ కంపెనీలకు పంపినట్లు అధికారులు తెలిపారు.
Telangana: తెలంగాణలో యూరియా కోసం రైతుల పాట్లు
డబ్బు లావాదేవీల కోసం శ్రవణ్ కుమార్ ఆరు కంపెనీలకు ప్రత్యేక మ్యూల్ అకౌంట్లు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన డబ్బును వేర్వేరు ఖాతాల ద్వారా తిరుగుతూ చివరకు ఈ కంపెనీల అకౌంట్లలోకి చేరేలా మొత్తం వ్యవస్థను రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. శ్రవణ్ కుమార్ వ్యవహారం కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదు. అతను దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ గ్యాంగులతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ లింకుల ద్వారానే నకిలీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు జరిపి, డబ్బులను దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. దీని నేపథ్యంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో అధికారులు శ్రవణ్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొంత మంది వ్యక్తులు ఈ మోసాల్లో పాల్గొన్న అవకాశముందని భావిస్తూ, పోలీసులు దర్యాప్తును విస్తరిస్తున్నారు.
Saipallavi : శ్రీలీల, కృతిశెట్టి, భాగ్య శ్రీ.. సాయిపల్లవిని చూసి నేర్చుకోండి..