Nude Calls : ఈజీ మనీ కోసం అడ్డదార్లు దొక్కుతున్నారు కొందరు అక్రమార్కులు. అమాయక ప్రజలను మోసం చేస్తూ లక్షల్లో సంపాదించేందుకు ప్లాన్ వేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో వెలుగు చూసిన చామెట్ యాప్ న్యూడ్ కాల్స్, అసభ్య చాటింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. చామెట్ యాప్ తో మహిళలు పక్కదారి పడుతున్నారంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ చామెట్ యాప్ పేరుతో డబ్బులకు న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నట్టు తేలింది.
read also : Hanamkonda Collectorate : కలెక్టరేట్ లో కామాంధుడు.. సిబ్బందిపై అత్యాచారయత్నం..
ఈజీ మనీ కోసం గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్, న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నారు కొందరు మహిళలు. మట్టంపల్లి మండలానికి చెందిన ఒక మహిళ, పురుషుడు ఈ యాప్ ప్రమోట్ చేసినట్లుగా తెలుస్తోంది. మండలంలోని కృష్ణ తండా, రామచంద్రపురం తండా, హేమ్ల తండా, గుర్రంబోడ్ తండాలో 200 మందికి పైగా మహిళలు, పురుషులు చామెట్ యాప్ ఉపయోగిస్తున్నట్లు తేలింది. మహిళలకు డబ్బు ఆశ చూపి యాప్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. యాప్ ప్రమోట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తేల్చి చెప్పారు.
read also : Bigg Boss 9 : కాంట్రవర్సీ ఉన్నోళ్లే కావాలి.. బిగ్ బాస్ తిడుతున్నా పట్టించుకోవా..