APSRTC : ఖరీదైన చీర మాయం కావడంతో ఆర్టీసీ అధికారుల మెడకు చుట్టుకుంది. చీర ఎక్కడుందో తెలియక కార్గో ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ కార్గో సర్వీసులను నిర్వహిస్తోంది. పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేస్తుండటంతో చాలామంది ఆర్టీసీ కార్గో సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినుకొండ డిపోకి రావాల్సిన పార్శిల్ రాకపోవడంతో కార్గో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఎందుకంత హైరానా అనుకుంటున్నారా..! Hyderabad: నగరంలో వరుస అగ్నిప్రమాద ఘటనలు.. నిన్న జీడిమెట్ల,…
సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్‌ను అరెస్ట్ దిశగా పోలీసులు చర్యలు సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయపాల్ ను పోలీసులు విచారించారు. ఆయన రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ముద్దాయిగా ఉన్నారు. గత విచారణలో విజయపాల్‌ని ఎన్ని ప్రశ్నలు అడిగినా గుర్తు లేదు.. తెలియదు.. మర్చిపోయాను అంటూ సమాధానమిచ్చారు. రెవెన్యూ అధికారులు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. విజయపాల్ కి ముందస్తు బెయిల్ సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఎస్పీ ఏఆర్…
ఒంగోలు పండుగలకు ఎంతో ప్రత్యేకం.. దసరా సంబరాల్లో కళారాలు.. దీపావళికి సత్యభామ.. నరకాసుర వధ.. వంటి సాంప్రదాయ కళలను, కళాకారులను ప్రోత్సహిస్తారు. అందులో భాగంగా దీపావళి రోజున సత్యభామ, నరకాసుర వధ వీధి పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు.. 1902 వ సంవత్సరం నుంచి ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో ఉన్న యువజన మిత్ర మండలి నిర్వహించే నరకాసుర వధ కార్యక్రమం ఇంకెక్కడా కనిపించదు..
వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రామన్న చెరువు కట్ట తెగింది. దీంతో.. 216వ నంబర్ ఒంగోలు, దిగమర్రు జాతీయ రహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. జాతీయ రహదారిపై దాదాపు అర కిలోమీటర్ మేర.. రోడ్డుపై దాదాపు మూడు అడుగుల వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో.. జాతీయ రహదారిపై వెళ్ళే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Prakasam: అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరంలో అలల ఎగసి పడుతున్నాయి. దీంతో జిల్లాలోని ఐదు తీర ప్రాంత మండలాల్లో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాకు చేరుకుంది.
ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కలకలం రేగింది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. అయితే, ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల చించివేత ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
ప్రకాశం జిల్లా ఒంగోలులో శిశువు విక్రయం కలకలం రేపింది. ఒంగోలు రిమ్స్ లో రూ. పది వేలకు కన్న కూతురుని విక్రయించింది తల్లి. ఆమె అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తుంది. కాగా.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరుకి చెందిన ఓ వ్యక్తికి మధ్యవర్తుల ద్వారా విక్రయించింది. అయితే.. పాపను వారికి అమ్మిన తర్వాత రిమ్స్ లో కనిపించకుండా పోయింది అంగన్వాడీ కార్యకర్త.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ బూతులకు ఇవాళ మాక్ పోలింగ్, రీ చెకింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ రీ కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘానికి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దరఖాస్తు చేశారు.
ఒంగోలు లోక్ సభ నియోజక వర్గం నుంచి వైసీపీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తు్న్న ఆయన.. ఈ రోజు బేస్తవారిపేటలో ఆత్మీయ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.