Narakasura Vadha: ఒంగోలు పండుగలకు ఎంతో ప్రత్యేకం.. దసరా సంబరాల్లో కళారాలు.. దీపావళికి సత్యభామ.. నరకాసుర వధ.. వంటి సాంప్రదాయ కళలను, కళాకారులను ప్రోత్సహిస్తారు. అందులో భాగంగా దీపావళి రోజున సత్యభామ, నరకాసుర వధ వీధి పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు.. 1902 వ సంవత్సరం నుంచి ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ లో ఉన్న యువజన మిత్ర మండలి నిర్వహించే నరకాసుర వధ కార్యక్రమం ఇంకెక్కడా కనిపించదు.. దీంతో పాటు ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆద్వర్యంలో 39.5 అడుగుల నరకాసురుని బొమ్మను బాణసంచాతో తయారు చేసి దీపావళి అందరి జీవితాల్లో చీకట్లను పారద్రోలి వెలుగులను నింపాలని కోరుకుంటూ నరకాసుర వధ చేశారు. భారతదేశంలో కోల్ కతా తరువాత ఒంగోలు లోనే నరకాసుర వధ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Read Also: Nagachaitanya : నాగచైతన్య జాన్వీ జోడీ సెట్ అయ్యేనా !
ఒంగోలులో నరకాసుర వధ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ప్రతి దీపావళికి ముందు నరకాసుర వధ ప్రదర్శన సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. 1902 నుంచి కొనసాగుతున్న ఈ సాంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. నరక చతుర్దశి రోజు అర్ధరాత్రి ఈ ప్రదర్శన మొదలై తెల్లవారే వరకూ ఈ నరకాసుర వధ ఘట్టం కొనసాగుతుంది. ఒంగోలులో తొలుత శ్రీయువజన మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంబరాలు ప్రారంభమయ్యాయి. అనంతరం కొంతమంది మిత్రులు కలిసి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి 39.5 అడుగుల భారీ నరకాసురుని బొమ్మను ఏర్పాటు చేశారు. నగరంలోని సివియన్ రీడింగ్ రూం సమీపంలో చెన్నకేశవస్వామి ఆలయం దగ్గర ఈ బొమ్మను రోడ్డుపై నిలబెట్టారు. అనంతరం బాణాసంచా పేల్చి బొమ్మను కాల్చారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భారతదేశంలో కోల్‌కతా తరువాత ఒంగోలులోనే నరకాసుర వధ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒంగోలులో వినూత్నంగా నిర్వహించే దసరా సంబరాల్లో కళారాలు.. దీపావళికి సత్యభామ.. నరకాసుర వధ.. వంటి సాంప్రదాయ కళలు, దీపావళి రోజున సత్యభామ, నరకాసుర వధ వీధి పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు.. బాణాసంచాతో తయారు చేసే నరకాసుర వధ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సుధూర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు…