కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వదిలిపోలేదు. రెండేళ్ల నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా మొదటి తరం కరోనా, ఆ తరువాత డెల్టా వేరియంట్ విజృంభించింది. కాగా ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కొంతమేర డెల్టా వేరియంట్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ విధానం ద్వారా మహమ్మారి 2022 చివరి వరకు అంతం అయ్యే అవకాశం ఉంటుందని బిల్‌గేట్స్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.
Read: ఇకపై అక్కడ నో స్మోకింగ్… యువతను రక్షించేందుకే…
కొత్త వేరియంట్‌లు వ్యాప్తి కారణంగా వ్యాక్సినేషన్ అందించడం ఆలస్యం అవుతుందని, 2022 ఆఖరు వరకు తప్పకుండా ప్రపంచంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశం ఉంటుందని బిల్‌గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త వేరియంట్లను వేగంగా గుర్తించడంతో పాటు, వ్యాక్సిన్లను కూడా త్వరగా తయారు చేస్తుండటంతో త్వరలోనే కరోనా అంతం అవుతుందని అన్నారు.