Off The Record: దూరం.. దూరం.. ఆ టీడీపీ నేతల మధ్య సయోధ్య సాధ్యమేనా?
- కాల్వ శ్రీనివాసులు, వర్సెస్ పూల నాగరాజు..
- ఇద్దరిదీ బోయ సామాజికవర్గం, ఒకప్పుడు సాన్నిహిత్యం..
- నాగరాజును జడ్పీ ఛైర్మన్ చేయడానికి గతంలో కాల్వ మద్దతు..
- 2019లో రాయదుర్గం టిక్కెట్ కోసం ఇద్దరి ప్రయత్నాలు, కాల్వకే..
- నాడు తన ఓటమికి నాగరాజు పని చేశాడని కాల్వ డౌట్..
- 2024లో కూడా టిక్కెట్ కోసం ఇద్దరి ట్రయల్స్, కాల్వకే..
- నాగరాజుకు ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పదవి..
- అనంతపురం టీడీపీ అధ్యక్షుడిగా నాగరాజు..
- కలిసి పని చేయాల్సిన నేతల మధ్య కనిపించని అంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: అనంతపురం జిల్లా టీడీపీ నేతల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వివాదాలు రేగుతుండగా, మరికొన్ని చోట్ల సమసిపోయాయనుకున్న విభేదాలు తిరిగి పురుడు పోసుకుంటున్నాయి. ప్రస్తుతం జిల్లాకు చెందినఇద్దరు కీలన నేతల మధ్య ఇలాంటిదే జరుగుతోందట. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడైన పూల నాగరాజు మధ్య పాత పగలు మళ్లీ రేగుతున్నాయట. ఇద్దరూ రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన వారే. పైగా ఇద్దరిదీ…ఒకటే బలమైన బోయ సామాజికవర్గమే. ఒకప్పుడు బాగా సఖ్యతగా ఉన్న ఇద్దరి మధ్య ఇప్పుడు పైకి కనిపించని అంతరం పెరిగిందని అంటున్నారు. కాల్వ శ్రీనివాసులు జిల్లాలో సీనియర్ నాయకుడు. ఒకసారి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా, చీఫ్ విప్ గా పని చేశారు. పార్టీ పొలిట్ బ్యూరోలో కూడా కీలకంగా ఉన్న నేత. చంద్రబాబుకు నమ్మిన బంటు అని చెబుతారు. పైగా… టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. వివాద రహితుడని, అందర్నీ సమన్వయం చేసుకుని పోతుంటారన్న అభిప్రాయం ఉంది.
ఇక ప్రస్తుత జిల్లా ప్రెసిడెంట్ పూల నాగరాజు విషయానికొస్తే…. ఆయన పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉండే వారు. జడ్పీటీసీగా గెలిచి బలమున్న నేత అని ప్రూవ్ చేసుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నాగరాజును జడ్పీ ఛైర్మన్ చేయాలని కాల్వ శ్రీనివాసులు గట్టిగా ప్రయత్నించారు. మొదటి టర్మ్‌లో ఛాన్స్ రాకపోయినా రెండవ సారి మాత్రం నాగరాదుకు ఆ అవకాశం దక్కింది. ఆ తర్వాత 2019ఎన్నికల్లో రాయదుర్గం టిక్కెట్ కోసం టీడీపీలో పోటీ ఏర్పడింది. బోయ సామాజికవర్గానికే చెందిన నాగరాజు కూడా పోటీ పడ్డట్టు అప్పట్లో చెప్పుకున్నారు. టీడీపీ అధిష్టానం మాత్రం ఫైనల్‌గా కాల్వ వైపే మొగ్గింది. కానీ… అప్పుడు జగన్ వేవ్ లో ఓటమి తప్పలేదు. అలాగే అప్పుడు సొంత పార్టీ నేతలే కాల్వ శ్రీనివాసులుకు వ్యతిరేకంగా పని చేసినట్టు కూడా చెప్పుకున్నారు. అది నాగరాజేనన్న అనుమానంతో ఇద్దరి మధ్య అంతరం ఏర్పడింది. ఒకప్పుడు కలిసి పనిచేసిన ఈ ఇద్దరు తర్వాత ఎడమెహం పెడమోహంగా మారిపోయారు. కానీ ఎప్పుడూ బహిరంగంగా పరస్పర విమర్శలు చేసుకోలేదు.
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇక 2024లో కూడా నాగరాజు టిక్కెట్ కోసం ట్రై చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం మరోసారి కాల్వకే ఇచ్చింది. ఈ ఎన్నికల్లో శ్రీనివాసులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. విప్‌గా అవకాశం దక్కింది. ఇటు నాగరాజుకు ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పదవి వచ్చింది. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవికి కాల్వే కరెక్ట్ అని పార్టీ పెద్దలు భావించినా… ఆయన నిరాకరించారట. ఇందుకు జిల్లా టీడీపీలో ఉన్న పరిస్థితులే కారణమని అంటారు. తనకు వద్దని, ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పారట కాల్వ. కానీ ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు ఆ పదవి పూల నాగరాజును వరించింది. అయితే జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కత్తి మీద సామేనని అంటున్నారు. పైగా కీలక నేత కాల్వ శ్రీనివాసులు తో చాలా గ్యాప్ ఉంది. ఇంకో వైపు ఇదే సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం కూడా నాగరాజుతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద కొత్త అధ్యక్షుడికి, సొంత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ లీడర్స్‌కు మధ్య గ్యాప్ బాగా ఉందని, ఆయన దాన్ని పూరించుకోవడంతోపాటు మిగతా కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న పంచాయితీల్ని తేల్చడం అంత ఈజీ కాదన్నది అనంతపురం పొలిటికల్ టాక్.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!