ఒమిక్రాన్ వేరియంల్ కేసులపై అమెరికా సీడీసీ కీలక వ్యాఖ్యలు చేసింది. వైరస్‌లో జన్యుపరమైన మార్పులు అధికంగా జరుగుతున్నాయని, ఫలితంగా ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకొచ్చిందని, గతంలో వాడిన చికిత్సల్లో కొన్ని మాత్రమే ఒమిక్రాన్‌పై పనిచేస్తాయని సీడీసీ తెలియజేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కరోనా వేరియంట్‌లో సార్స్ కోవ్ 2 కంటే ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోందని, వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిలో లక్షణాలు కనిపించకున్నా, ఒమిక్రాన్ వాహకదారుడిగా వేరొకరికి వేరియంట్‌ను సంక్రమింపజేసే అవకాశం ఉందని సీడీసీ వెల్లడించింది.
Read: గుంటూరు జిల్లాలో విషాదం.. ఆరుగురు వేదపాఠశాల విద్యార్థులు మృతి…
టీకాలు తీసుకున్న వారిలో ఒమిక్రాన్ తీవ్రతను అంచనా వేయడానికి మరింత సమయం పడుతుందని, తగినంత డేటా అవసరం అవుతుందని సీడీఎస్ పేర్కొన్నది. టీకాలు తీసుకుంటే ఆసుపత్రికి వెళ్లే అవసరం ఉండకపోవచ్చని, కొంతమేర టీకాలు రక్షిస్తాయని సీడీసీ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవడం వలన వ్యాధి తీవ్రత మందగించి మ్యూటేషన్లు తగ్గి కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా ఉంటాయని సీడీఎస్ తెలియజేసింది. థియేటర్లు వంటి పబ్లిక్ ఇండోర్ ప్రాంతాల్లో మాస్కులు ధరిస్తే వ్యాప్తిని తగ్గించవచ్చిన సీడీసీ తెలియజేసింది.