ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ర్టంలో కేసులు నమోదు అవ్వగా తాజాగా తెలంగాణలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్‌లో 23 ఏండ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 25కు చేరింది. హయత్‌నగర్‌కు చెందిన యువకుడు ఇటీవలే సూడాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఒమిక్రాన్ సోకిన యువకుడిని అధికారులు గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించారు. ఈ యువకుడి…
ఒమిక్రాన్ కేసులు ప్రపంచంలో తీవ్రంగా పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రపంచం యావత్తు అతలాకుతలం అవుతున్నది. ఒమిక్రాన్‌పై ఇటీవలే బిల్‌గేట్స్ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అన్నారు. ఆయన ఈ ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది. ఒమిక్రాన్ కేసులు భారీగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టాయి. దీంతో బిల్‌గేట్స్ తన ప్రకటనపై యుటర్న్ టీసుకున్నారు. ప్రపంచం చాలా దారుణమైన దశకు చేరుకుంటుందని, రానున్న రోజులు…
ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలో క్రమ క్రమంగా విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే మన దేశంలో 200 కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 39 ఏళ్ల సదరు మహిళ ఈ నెల 12 వ తేదీన కెన్యా నుంచి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకున్న మహిళ నమూనాలను…
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తోంది… యూఎస్‌లో పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. గణాంకాలను పరిశీలిస్తే.. గత వారం రోజుల్లో నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయంటే.. ఒమిక్రాన్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, న్యూయార్క్ ఏరియాలో తాజా కేసుల్లో 90శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉండడం కూడా ఆందోళన కలిగిస్తోంది.. గత వారం…
ప్రపంచ దేశాలతో ఓ ఆటాడుకుంది కరోనా వైరస్.. లక్షలాది మంది ప్రాణాలను తీసింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది.. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మరోసారి దాడి చేస్తోంది.. అయితే, కరోనా మందు పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య పేరు వినబడుతోంది.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో… ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు.. పెద్ద చర్చగా మారింది.. పెద్ద సంఖ్యలో బాధితులు ఆనందయ్య మందు కోసం…
దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 6,317 కరోనా కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఒక్కరోజులో 318 మంది కరోనా సోకి చనిపోయినట్లు తెలిపారు. వీరితో పాటు 3,900 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 78,190 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీనితో పాటు దేశంలో 138.95 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు…
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ పలు దేశాలకు వ్యాపించగా అక్కడ పలు ఆంక్షలు విధించారు. కొన్ని దేశాల్లో విమాన రాకపోకలపై నిబంధనలు పాటిస్తున్నారు. అయితే రోజురోజుకు ఒమిక్రాన్ విజృంభన పెరిగిపోతుండడంతో తాజాగా యూకేలో ఒక్కరోజే 15,363 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య లక్ష దాటడంతో ప్రపంచ దేశాలు మరోసారి భయాందోళన చెందుతున్నాయి. యూకేలో ఇప్పటి వరకు…
తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్నారని, వారదందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.దీంతో వారి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 9,122 మంది ప్రయాణికులు వచ్చారు.…
కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అయింది. కరోనా తగ్గిందనుకునేలోపే ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. మేడారంకి ముందస్తు మొక్కుల కోసం వస్తున్న వాళ్ళను కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. టీకా వేసుకున్న వారికే వనదేవతల దర్శనానికి అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్లకు ఒక్కసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరకు అప్పుడే జనం తాకిడి పెరిగింది. కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అని జరుగుతున్న ప్రచారం నేపథ్యం…
దేశంలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. క్లబ్స్, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లలో 50% కెపాసిటీతోనే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని, డీజేకు అనుమతి లేదని స్పష్టం చేసింది. టీకా తీసుకోని వారికి వేడుకల్లో పాల్గొనేందుకు పర్మిషన్ ఉండదని తెలిపింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2022 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. Read Also: 20 యూట్యూబ్…