ప్రపంచం మొత్తం మీద ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డెల్టా నుంచి కోలుకోక ముందే ఒమిక్రాన్ వేరియంట్ ఎటాక్ చేస్తున్నది. శీతాకాలం కావడంతో సాధారణంగానే చలి తీవ్రత పెరిగింది. ఫలితంగా జ్వరం, తలనొప్పి వంటి వాటితో ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడినట్టు అనిపించినా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగినా భయపడిపోతాం. పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం. Read: భారత్‌లో జీరో…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో పెద్దగా ముప్పు లేదనే అంచనాలున్నాయి.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది.. డెత్ రేట్ చాలా తక్కువంటూ ప్రచారం సాగింది.. కానీ, ఒమిక్రాన్ బారినపడి ఏకంగా 12 మంది మృతిచెందినట్టు అధికారికంగా ప్రకటించింది బ్రిటన్.. యూకేలో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌తో 104 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారని ఇవాళ వెల్లడించిన బ్రిటన్ ఉప ప్రధానమంత్రి డొమినిక్ రాబ్.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12 మంది ఒమిక్రాన్ బాధితులు…
గత నెల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే పలు దేశాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. అయితే ఇటీవల భారత్‌లోకి కూడా ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. భారత్‌లోని పలు రాష్ట్రాలకు వ్యాప్తి చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దాని ప్రభావాన్ని చూపుతోంది. 20 రోజుల వ్యవధిలోనే దాదాపు 100కు పైగా ఒమిక్రాన్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి.…
కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా దేశంపై తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6,563 కొత్త కరోనా కేసులు రాగా, 132 మంది మరణించారు. అయితే నిన్న ఒక్క రోజు 8,077 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 82,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇటీవల దేశంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే…
ప్రపంచ దేశాలు గత 2 సంవత్సరాలుగా కరోనా మహామ్మారితో పోరాడుతూనే ఉన్నాయి. కరోనా రక్కసి కొత్తకొత్త రూపాలు ఎత్తి ప్రజలపై విరుచుకుపడుతోంది. మొన్నటి వరకు అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు సైతం డెల్టా వేరియంట్‌ను తట్టుకోలేక విలవిలలాడిపోయాయి. అయితే ఇప్పుడు గత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతోంది. అంతేకాకండా ఆయా దేశాల ప్రజలపై దాని ప్రభావాన్ని చూపుడంతో భారీగా ఒమిక్రాన్ వేరియంట్…
ఇండియాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగి పోతుంది. తాజాగా ఇండియాలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో కొత్త గా రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన ఇద్దరి లో ఒమిక్రాన్ వైరస్ ను గుర్తించారు. తక్కువ వ్యవధిలోనే.. ఒమిక్రాన్ కేసులు వేగం పెరగడం.. అందరిన కలవరపరుస్తుంది. గత మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య ఇండియాలో డబుల్ అయింది. ప్రస్తుతం 11 రాష్ట్రల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.…
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరింయట్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సారి కనుక ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగి ఆస్పత్రుల్లో వైద్యం కోసం చేరితే ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా దేశ ప్రభుత్వాలదేనని తెలిపింది. కరోనా కొత్త వేరింయట్ ఒమిక్రాన్ ఇప్పటి వరకు 89 దేశాలకు వ్యాపించినట్లు who తెలిపింది. ఈ వేరియంట్ సోకిన ప్రాంతాల్లో కేసులు, రెండు మూడు రోజుల్లోనే రెట్టింపు…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో.. నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా దేశాలు.. ఇప్పటికే చాలా దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. కేసుల తీవ్రత పెరుగుతుండడంతో.. మళ్లీ మాస్క్ తప్పనిసరి చేస్తున్నాయి.. అందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు ఉపక్రమించాయి.. ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఈ క్రమంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. క్రిస్మస్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉండటంతో.. లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం…