ప్రపంచ దేశాలతో ఓ ఆటాడుకుంది కరోనా వైరస్.. లక్షలాది మంది ప్రాణాలను తీసింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది.. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మరోసారి దాడి చేస్తోంది.. అయితే, కరోనా మందు పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య పేరు వినబడుతోంది.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో… ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు.. పెద్ద చర్చగా మారింది.. పెద్ద సంఖ్యలో బాధితులు ఆనందయ్య మందు కోసం క్యూ కట్టారు.. ఆ తర్వాత ప్రభుత్వం రంగంలోకి దిగడం.. వ్యవహారం కోర్టుల వరకు వెళ్లడంతో.. చివరకు నేరుగా బాధితులకే పోస్టు ద్వారా మందుల పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఒమిక్రాన్ భయపెడుతోన్న సమయంలో.. మరోసారి మందు తయారు చేసేందుకు సిద్ధం అయ్యారు ఆనందయ్య..
Read Also: ఒకరోజు ముందుగానే పార్లమెంట్ నిరవధిక వాయిదా..!
ఒమిక్రాన్ వేరియంట్‌ను కట్టడి చేసేందుకు తన వద్ద మందు సిద్ధంగా ఉందని తెలిపారు ఆనందయ్య.. గతంలో కరోనా కోసం తయారుచేసిన మందుకు మరికొన్ని మూలికలను జోడించి ఒమిక్రాన్ వేరియంట్ కోసం మందును తయారు చేశామని చెబుతున్నారు.. అంతేకాదు.. ఇది ఒమిక్రాన్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇప్పుడు కూడా పేదలందరికీ తన మందును ఉచితంగా అందిస్తామని ప్రకటించారు ఆనందయ్య.. కానీ, ఎక్కువ మోతాదులో కావాలంటే మాత్రం ప్రత్యేకంగా తయారుచేసి ఇస్తామని.. తన మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవంటున్నారు. ఒమిక్రాన్ సోకినవారు తనను సంప్రదిస్తే తానే స్వయంగా వచ్చి వైద్యం అందిస్తానని వెల్లడించారు ఆనందయ్య… కేవలం 48 గంటల్లోనే వ్యాధిని నమం చేస్తాననంటున్నారు.. ఇక, కొత్త వేరియంట్ బారినపడి ఆస్పత్రుల్లో చేరినవారి బంధువులు సంప్రదిస్తే.. వారికి ఉచితంగా మందు పంపిణీ చేస్తానని తెలిపారు ఆనందయ్య. మరి, ఒమిక్రాన్ కోసం ఆనందయ్య తయారు చేసిన మందుకు ఎలాంటి అడ్డంకులు రాబోతున్నాయి.. లేదా సజావుగానే పంపిణీ జరగబోతుందా? మరోసారి మందు పంపిణీలో గందరగోళ పరిస్థితులు ఎదురుకాబుతున్నాయా? అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.