సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తోంది… యూఎస్‌లో పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. గణాంకాలను పరిశీలిస్తే.. గత వారం రోజుల్లో నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయంటే.. ఒమిక్రాన్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, న్యూయార్క్ ఏరియాలో తాజా కేసుల్లో 90శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉండడం కూడా ఆందోళన కలిగిస్తోంది.. గత వారం రోజుల్లో మొత్తం 6,50,000 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నవంబర్ చివరివరకూ నమోదైన కేసుల్లో 99.5 శాతం కేసులు డెల్టా వేరియంట్‌వే కాగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని ఒమిక్రాన్ జట్ స్పీడ్‌తో ఆక్రమించిందని అమెరికా చెబుతోంది.
ఇక, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకుది… బైడెన్ సిబ్బందిలోనూ ఒకరికి పాజిటివ్‌గా తేలింది.. బైడెన్ తన ఎయిర్ ఫోర్స్ వన్ ప్రత్యేక విమానంలో తాజాగా దక్షిణ కరోలినాలోని ఆరెంజ్ ప్రాంతం నుంచి ఫిలడెల్ఫియాకు ప్రయాణం చేశారు.. ఆ సమయంలో విమానంలో ఉన్న సిబ్బందిలో ఒకరికి కరోనా మహమ్మారి సోకింది.. బైడెన్‌తో కలిసి అతడు 30 నిమిషాలపాటు ప్రయాణం చేసినట్టుగా చెబుతున్నారు.. దీంతో బైడెన్‌కు కరోనా సోకుతుందనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.. అయితే, అమెరికా అధ్యక్షుడికి రెగ్యులర్‌గా కరోనా టెస్ట్‌లు చేస్తుంటారు.. ఇవాళ మరోసారి టెస్ట్ చేయనున్నారు.. అయితే, అధ్యక్షుడికి కూడా కరోనా సోకిందా? అది ఒమిక్రాన్ వేరియంటా? అనే టెన్షన్ మొదలైంది.