కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అయింది. కరోనా తగ్గిందనుకునేలోపే ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. మేడారంకి ముందస్తు మొక్కుల కోసం వస్తున్న వాళ్ళను కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. టీకా వేసుకున్న వారికే వనదేవతల దర్శనానికి అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండేళ్లకు ఒక్కసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరకు అప్పుడే జనం తాకిడి పెరిగింది. కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అని జరుగుతున్న ప్రచారం నేపథ్యం లో ఆర్టీసీ కూడా మేడారం జాతరకు బస్సులను ప్రారంభించింది. సాధారణంగా ఫిబ్రవరిలో 16 నుండి19 వరకు గిరిజనుల ఆరాధ్య దైవం అయిన సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర జరగనున్న ఒమిక్రాన్ ముంపు నేపథ్యంలో చాలా మంది ముందస్తు మొక్కులకు వెళుతున్నారు.
ఆదివారం.. బుధవారాలలో జనం ఎక్కువగా వస్తున్నారు. దీంతో ములుగు జిల్లా వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. మేడారం కి వచ్చే వారిని జంపన్న వాగు దగ్గర.. అమ్మవార్ల గద్దె దగ్గర కట్టడి చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మేడారం దర్శనానికి వచ్చే వాళ్ళు కోవిడ్ రూల్ పాటించేలా చర్యలు తీసుకున్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికే ఎంట్రీకి అనుమతి ఇస్తున్నారు. రెండు డోసులు టీకా తీసుకున్నట్లు ఆధారాలు చూపించిన వారికే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. శని,ఆదివారం, బుధవారం రోజుల్లో మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద ఏకంగా కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు జిల్లా వైద్యాధికారులు, శని,ఆదివారం, బుధవారాల్లో భక్తులు ఎక్కువగా వస్తున్న సందర్భంగా వ్యాక్సిన్ తీసుకోని వారికి వనదేవతల సన్నిధిలో వ్యాక్సిన్ వేస్తున్నారు. భక్తులు వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా ఆధారాలు చూపించాలి.
ఒక్క మేడారంలోనే కాకుండాజిల్లాలో పర్యాటక ప్రాంతాలైన రామప్ప, బొగత జలపాతం వద్ద ప్రతీ శనివారం,ఆదివారం సెలవు దినాలు. బుధవారం భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశ ఉండడంతతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వ్యాక్సిన్ చేసేలా చర్యలు తీసుకున్నారు.వ్యాక్సిన్ వేసుకున్నా మాస్కులు పెట్టుకోవడం, శానిటైజ్ చేయిస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్, హెల్త్ డైరెక్టర్ ములుగు జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారులు.
ఇన్న జాగ్రత్తలు తీసుకున్నా మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులను ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న వేళ మేడారం జాతరకు వస్తున్న వాళ్ళు కొత్త వేరియంట్ బారిన పడకుండా ఎలా కాపాడాలనేది అధికారులకు సవాల్‌గా మారింది.