ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ర్టంలో కేసులు నమోదు అవ్వగా తాజాగా తెలంగాణలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్‌లో 23 ఏండ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 25కు చేరింది.
హయత్‌నగర్‌కు చెందిన యువకుడు ఇటీవలే సూడాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఒమిక్రాన్ సోకిన యువకుడిని అధికారులు గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించారు. ఈ యువకుడి కాంటాక్ట్‌లను గుర్తించి శాంపిళ్లను ఆరోగ్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఒమిక్రాన్ అతడి నుంచి ఎవ్వరి వ్యాపించకుండా ఉండేందుకు వైద్యాధికారులు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారు. కాగా ఈ మహమ్మారి రోజు రోజుకు విస్తరించడం కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది.