ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ తీవ్రత తక్కువ : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. కరోనా కేసుల వైద్యం కోసం అదనపు పడకలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా దాని తీవ్రత తక్కువేనని ఆయన తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధంగా 1400 పడకలు హైద్రాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. నిలోఫర్‌లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని, మరో 6 ఆసుపత్రిలో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అందులో భాగంగా వనస్థలిపురంలో 100 పడకలు ఏర్పాడు చేశామన్నారు. అయితే అందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. 24 లక్షల హోమ్ ఐసోలాషన్ కిట్లను అందుబాటులో ఉంచుకున్నామని, పేదల వైద్యం మీదా ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం ప్రకటన చేసిందని ఆయన వెల్లడించారు. పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి సీఎం కేసీఆర్ ఆదేశాల ఇచ్చారని, ఫ్రూట్ మార్కెట్ వద్ద 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రానున్నట్లు దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని ఆయన తెలిపారు. మన బస్తీ దవాఖాన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మున్సిపాలిటీలో కూడా బస్తీ దవాఖానలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ దృష్టిలో పెట్టుకొని అదనంగా వైద్యులను ఇక్కడ ఏర్పాటు చేసామని, రెండు డోస్‌లు కోవిడ్ వాక్సిన్ అందరూ తీసుకోవాలన్నారు. కొంచెం వ్యాధి లక్షణాలు ఉన్న పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!