Om Birla: మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్ ముఖ్యదేశంగా అవతరించిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ‘‘మహిళా సాధికారత సదస్సు’’లో ఆయన మాట్లాడారు. మహిళకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న సాంప్రదాయం అని చెప్పారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశము కూడా అభివృద్ధి చెందలేదని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో వారు ముఖ్యపాత్ర పోషించారని చెప్పారు. Read Also: Motel Killing: డల్లాస్ ‘‘నాగమల్లయ్య’’ హత్యతో ప్రవాసుల్లో భయం..…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజే హాట్‌హాట్‌గా సమావేశాలు మొదలయ్యాయి. ఆపరేషన్ సిందూర్, బీహార్ ఎన్నికల ప్రక్రియ, పలు అంశాలపై విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి.
Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తాను ఇచ్చిన వాగ్దానాన్ని నేరవేర్చారు. ఒకప్పుడు దు:ఖంతో నిండి ఉన్న ఆ ఇళ్లు, ఇప్పుడు సంతోషంగా ఉంది. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ హేమ రాజ్ మీనా కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యారు. ఆరేళ్ల క్రితం జరిగిన దాడి సమయంలో, దు:ఖంలో ఉన్న హేమరాజ్ భార్యని ఓదారుస్తూ, ఆమెకు కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ లోక్‌సభలో గరం గరం అయ్యారు. బుధవారం సభలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తుండగా స్పీకర్ ఓం బిర్లా పదే పదే అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ మాట్లాడుతుండగానే సభను స్పీకర్ వాయిదా వేసేశారు. దీంతో స్పీకర్ తీరును రాహుల్‌గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు.
పార్లమెంట్లో లోక్‌సభ స్పీకర్‌తో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ సమావేశం అయ్యారు. ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్‌తో ఏం చర్చించారన్నది ఇంకా తెలియలేదు. అయితే త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా డీఎంకే సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.
Om Birla: యూకే పర్యటనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెళ్లారు. ఈ సందర్భంగా లండన్‌లోని హైకమిషన్‌లో జరిగిన సమావేశంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను, వృద్ధిని యూకే బలంగా విశ్వసిస్తోందని తెలిపారు.
Panchayat se Parliament 2.0: దేశ వ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని మహిళా ప్రతినిధులకు పార్లమెంటు సెషన్స్, రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం ఈరోజు (జనవరి 6) లోక్‌సభలో స్టార్ట్ కానుంది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విచిత్రంగా ప్రవర్తించారు. ప్రధాని మోడీ పార్లమెంట్లో ప్రసగించిన సమయంలో మొబైల్ చూడడంలో మునిగిపోయారు. మోడీ ప్రసంగించినంత సేపు ఫోన్ చూస్తూనే ఉన్నారు.
Rahul Gandhi: శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తొలగించాలని ఈ రోజు ( డిసెంబర్ 11) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు.
శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి.. వారం రోజులుగా పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. అదానీ వ్యవహారం, యూపీ సంభల్ అల్లర్లు తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుపడుతుండటంతో.. సోమవారం కూడా ఉభయసభలు వాయిదా పడ్డాయి. దాంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటన చేశారు. మంగళవారం నుంచి ఉభయసభల సమావేశాలూ సజావుగా జరిగేలా సహకరించేందుకు అన్ని పక్షాలూ…