పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజే హాట్‌హాట్‌గా సమావేశాలు మొదలయ్యాయి. ఆపరేషన్ సిందూర్, బీహార్ ఎన్నికల ప్రక్రియ, పలు అంశాలపై విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. దీంతో పలుమార్లు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తొలి రోజంతా వాయిదాల పర్వమే కొనసాగింది.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో దారుణం.. భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య
పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలని పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో పాటు పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పడంపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అయితే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. అయినా కూడా ఆందోళనలు జరగడంతో సభ వాయిదాలు పడింది. తాజాగా ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు స్పీకర్ ఓం బిర్లా సమయం కేటాయించారు. 16 గంటల పాటు చర్చకు అనుమతిచ్చారు. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో తొమ్మిది గంటలు చర్చించనున్నారు. అలాగే కొత్త పన్ను బిల్లుకు 12 గంటల సమయం కేటాయించారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: బెంగాల్‌లో రాజకీయ మార్పు దేనికి.. 11 ఏళ్లు ఏం చేశారని మార్పు కావాలి.. మోడీపై మమత ఫైర్
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. పహల్గామ్‌లో దాడి చేసిన ఉగ్రవాదుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. కాల్పుల విరమణకు మధ్వర్తిత్వం వహించింది తానేనని పదే పదే ట్రంప్ ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటన చేశారని గుర్తుచేశారు. ఇక ప్రతిపక్షాల సహకారం కోరుతూ ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఏ అంశం నుంచి కూడా ప్రభుత్వం దూరంగా ఉండదని చెప్పారు.