Rahul Gandhi: స్పీకర్‌కు రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లేఖ
- సభలో ప్రసంగాన్ని అడ్డుకోవడంపై అభ్యంతరం
- స్పీకర్ బాధ్యతల్ని గుర్తుచేస్తూ లేఖలో ప్రస్తావన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంపై దుమారం రేపుతోంది. రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని స్పీకర్, అధికార సభ్యులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లేఖ రాశారు. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన పాత్రను, బాధ్యతలను స్పీకర్ ఓం బిర్లాకు గుర్తు చేశారు. స్పీకర్‌కు తన నిరసనను వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: Gaddafi: లిబియా నియంత గడాఫీ కుమారుడు హత్య.. ఎవరు చంపారంటే..!
Also Read
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
‘‘దేశ భద్రతపై లోకసభలో మాట్లాడేందుకు తనకున్న హక్కును అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. 2020లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ, ఉద్రిక్తతలను లోకసభలో గత సోమవారం ప్రస్తావిస్తుండగా తాను ఉటంకించే ‘‘మ్యాగజైన్’’ లోని అంశాల ప్రామాణికత, విశ్వసనీయతకు బాధ్యత వహించాలని స్పీకర్ ఆదేశించారు. లోక్‌సభ సంప్రదాయాలకు లోబడి.. గతంలో పలు సందర్భాల్లో స్పీకర్లు ఇచ్చిన ‘‘రూలింగ్”లకు అనుగుణంగా తాను ప్రస్తావించే అంశాలకు బాధ్యత వహించాలన్న నిబంధనను పాటించాను.’’ అని లేఖలో పేర్కొన్నారు.
‘‘స్పీకర్ అనుమతితో (పుస్తకం, మ్యాగజైన్), పత్రంలోని అంశాలను సభ్యుడు ప్రస్తావించిన తర్వాత వాటికి ప్రతి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అంతటితో స్పీకర్ పాత్ర పరిసమాప్తమౌతుంది. లోక్‌సభలో నన్ను మాట్లాడకుండా అడ్డుకోవడం సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించడమే కాకుండా.. ప్రతిపక్ష నేతగా దేశ భద్రతకు సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించకుండా నన్ను కావాలనే అడ్డుకోవడం తీవ్ర అందోళనకరమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడం గతంలో ఎన్నడూ, ఎప్పుడూ లేని పరిస్థితికి దారి తీసింది. ప్రభుత్వ ఆదేశాలు, ప్రోద్బలం మేరకు ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా నిలువరించడం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి. మన దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ లాంటిది ఈ పరిస్థితి. అందుకు నా నిరసనను వ్యక్తం చేస్తున్నాను. నిష్పక్షపాత చట్టసభ పరిరక్షకులుగా.. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన బాధ్యతలను స్పీకర్ ఓం బిర్లాకు గుర్తు చేస్తూ ప్రతిపక్షాలతో సహా సభ్యులందరి హక్కులను కాపాడండి.’’ అంటూ లేఖలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు.
ఇది కూడా చదవండి: Iran-US: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఇరాన్ డ్రోన్‌ను కూల్చేసిన అమెరికా
తాజావార్తలు
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?