టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా మొత్తం ఏడు పతకాలు సాధించింది. ఇందులో నాలుగు కాంస్యం, రెండు రజతం, ఒక గోల్డ్ పతకం ఉన్నది. అయితే, కొన్ని విభాగాల్లో ఇండియా అద్భుతమైన ప్రతిభను కనబరిచినా, చివరి నిమిషంలో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. విమెన్ హాకీ టీమ్ ఆద్యంతం అద్భుతమైన ఆటను ప్రదర్శించినా చివరకు కాస్యం చేజార్చుకుంది. కానీ, ఆటతీరుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. వెయిట్ లిఫ్టర్ దీపికా పూనియా తదితరులు తృతిటో కాంస్యం చేజార్చుకున్న సంగతి తెలిసిందే.…
ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాంగంలో కాంస్యపతకం గెలుచుకున్న లవ్లీనాకు అస్సాం ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కోటి రూపాయల నగదుతో పాటుగా, ఆమెకు పోలీసు శాఖల డీఎస్పీ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు, ఆమె నివశించే గ్రామంలో బాక్సింగ్ అకాడెమి ఏర్పాటుతో పాటుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హామీ ఇచ్చారు. టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తరువాత లవ్లీనా ఈరోజు సొంత రాష్ట్రం అస్సాంకు చేరుకున్నది. ఆమెను రీసీవ్ చేసుకోవడానికి…
మీరాభాయ్ చాను నుంచి నీరజ్ చోప్రా వరకు…! టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. పతకాల పట్టికలోనూ మెరుగైన స్థానం దక్కించుకుంది. మెడల్స్ లెక్కల్లోనూ కొత్త మార్క్‌ను సెట్ చేసింది. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలు గెలవడమే రికార్డుగా ఉండేది…?! కానీ ఆ రికార్డు ఇప్పుడు చెరిగిపోయింది..! టోక్యో వేదిక నుంచి మన క్రీడాకారులు భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండబోతుందన్న ఆశలు రేపారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ .. గతంలో ఎన్నడూ లేనంత…
వందేళ్ల క్రీడా చరిత్రలో అథ్లెట్ విభాగంలో భారత్ తొలి స్వర్ణం గెలుచుకుంది. భారత్ స్వర్ణం గెలుచుకోవడంతో దేశమంతా సంబరాలు చేసుకున్నది. ప్రభుత్వాలు నీరజ్ చోప్రాకు విలువైన బహుమతులు అందిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు నీరజ్ చోప్రాకు ఖరీదైన బహుమతులు అందిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, నీరజ్ పేరు ఉన్న వారికి కొన్ని చోట్ల ఉచిత పెట్రోల్ ఆఫర్‌ను ప్రకటించాయి. గుజరాత్‌లోని భరూచ్‌లోని ఒ పెట్రోల్ బంకులో ఉచిత పెట్రోల్ ఆఫర్‌ను ప్రకటించింది. సోమవారం సాయంత్రం 5…
విశ్వ క్రీడలు జపాన్ రాజధాని టోక్యోనగరంలో విజయవంతంగా ముగిశాయి. ఒకవైపు కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నప్పటికీ దానిని ఎదుర్కొంటూ క్రీడలను నిర్వహించారు. రాజధాని టోక్యోలో వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. వాటి ప్రభావం క్రీడానగరంపై పడిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ క్రీడాకారులు కరోనా బారిన పడుతూనే ఉన్నప్పటికీ పట్టుదలతో క్రీడలను పూర్తిచేశారు. ఒలింపిక్ క్రీడలు అంటే హడావుడి ఏ విధంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. క్రీడాకారులు, ప్రేక్షకులతో స్టేడియాలు కక్కిరిసిపోయి ఉంటాయి. కానీ, దానికి విరుద్దంగా క్రీడలు…
ఎలాగైనా స్వర్ణం గెలవాలని టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌తో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఒటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు కాంస్యపతకం పోరులో భారత జట్టు జర్మనీతో తలపడింది. నాలుగు క్వార్టర్ లుగా సాగిన గేమ్ హోరాహోరీగా సాగింది. రెండు క్వార్టర్‌లు ముగిసే సరికి 3-3 గోల్స్‌తో సమంగా ఉన్నాయి. అయితే, మూడో క్వార్టర్ లో ఇండియా లీడ్ సాధించి రెండు గోల్స్ చేసి 5-3 ఆధిక్యాన్ని సాధించింది.…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు ఆశలు రేపుతున్నారు. 53 కేజీల మహిళా విభాగంలో ఇండియా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్‌లో శుభారంభం చేశారు. స్వీడన్‌కు చెందిన మ్యాట్‌సన్‌ను 7-1 తేడాతో ఓడించారు. ఈ మ్యాచ్‌లో ఆదినుంచి ఫొగాట్ ఆదిపత్యం సాధించింది. వీలైనంత వరకూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని మట్టికరిపించింది. మొదటి పిరియడ్‌లో 2,2,1 స్కోర్ సాధించిన ఫొగాట్, రెండో పీరియడ్‌లో 2 స్కోర్ మాత్రమే చేసింది. అయితే, స్వీడన్ క్రీడాకారిణి ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పాయంట్…
ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. మహిళల బాక్సింగ్ కేటగిరి లవ్లీనా బొర్గొహెయిన్ కాంస్యపతకం సాధించింది. సెమీస్‌లో లవ్లీనా టర్కీకి చెందిన ప్రపంచ చాంపియన్ సుర్మెనెలి చేతిలో ఓటమిపాలైంది. మొత్తం 5 రౌండ్లలోకూడా సుర్మెనెలి ఆదిపత్యం కొనసాగించింది. దీంతో సుర్మెనెలి లవ్లీనాపై 5-0 తేడాతో విజయం సాధించింది. ఎలాగైన ప్రపంచ బాక్సర్‌పై విజయం సాధించి స్వర్ణం గెలవాలని చూసిన లవ్లీనాకు సెమీస్‌లో ఎదురుదెబ్బ తగలడంతో కాస్యంతో సరిపెట్టుకోవాలసి వచ్చింది. ఇప్పటికే ఇండియా వెయిట్ లిఫ్టింగ్‌లో చాను రజతం,…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. గత ఒలింపిక్స్‌లో కంటే ఈసారి మన ఆటగాళ్లు రాణిస్తున్నారని చెప్పొచ్చు. 1980లో రష్యాలో జరిగిన మాస్కో ఒలింపిక్స్ తరువాత 2021లో జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌కు చేరుకుంది. సెమీస్ లో ఓడిపోయినప్పటికీ మంచి ఆటను ప్రదర్శించి భవిష్యత్తులో జాతీయ క్రీడకు తిరిగి పునర్వైభవం రానుందని చెప్పకనే చెప్పారు. ఇక, మహిళల హాకీ జట్టు సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు…