ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర ఎప్పుడూ తీసికట్టే. మనతో ఎందులోనూ సరితూగని దేశాలు కూడా విశ్వ క్రీడా వేదికపై తలెత్తుకుని సగర్వంగా నిలబడుతుంటే.. ఇండియా మాత్రం పతకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన దుస్థితి. అడపాదడపా సాధించే విజయాలను అపురూపంగా కళ్లకద్దుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు టోక్యోలో కూడా మహిళలే భారత్ పరువు నిలబెట్టారు. టోక్యో ఒలింపిక్స్ తొలిరోజే వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం గెల్చింది. దేశ చరిత్రలో ఒలింపిక్స్ తొలిరోజే పతకం రావడం…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు దూసుకుపోతున్నది. నిన్నటి రోజున పురుషుల హాకీ జట్టు బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకున్నది. 3-1తేడాతో బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌లో బెల్జియంతో తలపడేందుకు సిద్ధమైంది. కాగా, అదే బాటలో ఇప్పుడు మహిళల హాకీ టీమ్ కూడా పయనిస్తోంది. మహిళల హాకీ టీమ్ బలమైన ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో ఓడించి సెమీస్ కు చేరుకున్నది. మొదటి క్వార్టర్‌లో ఏ జట్టు కూడా గోల్ చేయలేదు. రెండో క్వార్టర్ 22 వ నిమిషం వద్ద…
ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో పతకం ఖాయం అనే రీతిలో ఆశలు రేపిన భారత బాక్సర్ సతీష్ కుమార్ నిరాశపర్చాడు.. పతకానికి మరో అడుగు దూరంలోనే తన పోరాటాన్ని ముగించాడు.. 91 కిలోల సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో ఇవాళ జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్, వరల్డ్ నంబర్ వన్ జలలోవ్ బఖోదిర్ తో తలపడిన సతీష్‌కుమార్.. 0-5తో ఓటమిపాలయ్యారు.. తొలి రౌండ్ నుంచే సతీష్‌పై పూర్తిగా పైచేయి సాధించారు జలలోవ్… ప్రతి రౌండ్‌లోనూ జడ్జీలు జలలోవ్…
ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. ఒలింపిక్ నగరం టోక్యోలో రికార్డు స్థాయి కేసుల్ని నమోదు చేస్తోంది. తాజాగా 4 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. జపాన్ రాజధానిలో నాలుగువేలకు పైగా కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. అలాగే దేశంలో వరుసగా రెండోరోజు 10వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. మరోపక్క ఒలింపిక్ విలేజ్‌లో 21 మందికి కరోనా సోకింది. అక్కడ జులై 1 నుంచి ఇప్పటివరకూ 241 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అయితే..…
టోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది తెలుగు తేజం పీవీ సింధు… శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి, నాలుగో సీడ్ అకానా యమగూచిపై విజయం సాధించి సెమీస్‌లో ప్రవేశించారు.. తద్వారా ఓ అరుదైన రికార్డును కూడా సాధించగారు.. వరుసగా రెండుసార్లు ఒలిపింక్స్‌లో సెమీ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణి, షట్లర్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించారు.. అయితే, ఇవాళ జరగనున్న సెమీస్ సింధుకు కఠిన సవాల్ గా చెప్పాలి.. ఎందుకుంటే వరల్డ్ నెంబర్…
గత ఏడాది జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ గేమ్స్ పై కరోనా నీలి నీడలు కముకున్నాయి. ప్రస్తుతం టోక్యోలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో అక్కడ జపాన్ ప్రభుత్వం కోవిడ్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే కేసులు పెరుగుతుండటంతో అత్యవసర సమావేశమైన ఒలంపిక్స్ నిర్వాహకులు ఈ గేమ్స్ కు అభిమానుల అనుమతి నిరాకరించారు. అయితే ఈ ఏడాది జరిగే ఒలంపిక్స్ 2021 ప్రేక్షకులు…
భారత అథ్లెట్లు మైరాజ్ అహ్మద్ ఖాన్ మరియు అంగద్ వీర్ సింగ్ బజ్వా ఇద్దరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ఒక్క దేశం నుండి మరో దేశం వెళ్లారు. అయితే ప్రస్తుతం ఇటలీలో శిక్షణ తీసుకుంటున్న ఈ ఇద్దరు భారత షూటర్లు 2021 టోక్యో ఒలంపిక్స్ ను ఎంపికయ్యారు. కానీ అందుకోసం టోక్యో వెళ్లాలంటే తప్పకుండ వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. అయితే వీరు ఇప్పుడు శిక్షణ తీసుకుంటున్న ఇటలీలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో…
జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న పి.వి సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజనీలకు విషెస్ చెప్పారు సీఎం వైఎస్ జగన్. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చెక్ అందజేసిన సీఎం వైఎస్ జగన్… విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేశారు. రజనీ (ఉమెన్స్ హకీ) చిత్తూరు జిల్లా,…
ఉగాండా ఒలింపిక్ బృందం జపాన్‌కు చేరుకుంది. వీళ్లు ఆతిథ్య పట్టణం ఒసాకాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈలోపు ఆ బృందానికి టెస్ట్‌లు నిర్వహించగా.. ఓ ఆటగాడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని అటు నుంచి అటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే ఉగాండా టీంలోని అథ్లెట్లంతా చాలా రోజుల క్రితమే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. బయలుదేరే ముందు చేసిన టెస్టుల్లో అందరికీ నెగెటివ్ నిర్ధారణ అయ్యింది కూడా. అయినా కూడా ఆ అథ్లెట్‌కు కరోనా…