వందేళ్ల క్రీడా చరిత్రలో అథ్లెట్ విభాగంలో భారత్ తొలి స్వర్ణం గెలుచుకుంది. భారత్ స్వర్ణం గెలుచుకోవడంతో దేశమంతా సంబరాలు చేసుకున్నది. ప్రభుత్వాలు నీరజ్ చోప్రాకు విలువైన బహుమతులు అందిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు నీరజ్ చోప్రాకు ఖరీదైన బహుమతులు అందిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, నీరజ్ పేరు ఉన్న వారికి కొన్ని చోట్ల ఉచిత పెట్రోల్ ఆఫర్‌ను ప్రకటించాయి. గుజరాత్‌లోని భరూచ్‌లోని ఒ పెట్రోల్ బంకులో ఉచిత పెట్రోల్ ఆఫర్‌ను ప్రకటించింది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది. నీరజ్ పేరున్న వ్యక్తులు ఐడీ కార్డు చూపి ఉచితంగా పెట్రోల్‌ను పొందవచ్చు. అంతేకాదు, జునాగడ్‌లోని గిర్నార్ రోప్‌వే కంపెనీ నీరజ్ పేరున్న వ్యక్తులు ఉచితంగా రోప్‌వేలో ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. ఈ అవకాశం ఆగస్టు 20 వరకు ఉంటుందని ఆ సంస్థ తెలియజేసింది.