ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. మహిళల బాక్సింగ్ కేటగిరి లవ్లీనా బొర్గొహెయిన్ కాంస్యపతకం సాధించింది. సెమీస్‌లో లవ్లీనా టర్కీకి చెందిన ప్రపంచ చాంపియన్ సుర్మెనెలి చేతిలో ఓటమిపాలైంది. మొత్తం 5 రౌండ్లలోకూడా సుర్మెనెలి ఆదిపత్యం కొనసాగించింది. దీంతో సుర్మెనెలి లవ్లీనాపై 5-0 తేడాతో విజయం సాధించింది. ఎలాగైన ప్రపంచ బాక్సర్‌పై విజయం సాధించి స్వర్ణం గెలవాలని చూసిన లవ్లీనాకు సెమీస్‌లో ఎదురుదెబ్బ తగలడంతో కాస్యంతో సరిపెట్టుకోవాలసి వచ్చింది. ఇప్పటికే ఇండియా వెయిట్ లిఫ్టింగ్‌లో చాను రజతం, షటిల్‌లో పీవీసింధు కాంస్యపతకాలు గెలుచుకున్నారు. దీంతో ఇండియా ఇప్పటి వరకు ఈ ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించింది.
Read: వరుడు కావలెను: పాపులర్ జానపద పాట విడుదల