ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు సత్తా చాటింది. పురుషుల హాకీలో భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో జపాన్‌పై విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత, హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శనతో హాకీ జట్టు భారత కీర్తి పతాకాన్ని ఎగరేసింది.
Olympics: క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సి్ల్ (ఐసీసీ) చాలా ఏళ్లుగా కృషి చేస్తోంది. నిజానికి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి చాలా ప్రయత్నాలు జరిగినా ఇవి ఫలించలేదు. ఎట్టకేలకు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌కు చోటు ఉండవచ్చని తెలుస్తోంది. 2028 ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందంటూ బ్రిటీష్ వార్తాపత్రిక టెలిగ్రాఫ్ ప్రకటించింది. గత 100 సంవత్సరాలలో మొదటిసారిగా క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడలలో చేర్చనున్నట్లు…
ఫిబ్రవరి 4 నుంచి చైనాలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. కరోనా నిబంధనలకు కఠినంగా అమలు చేస్తూ క్రీడలను నిర్వహిస్తున్నారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వివధ దేశాల నుంచి క్రీడాకారులు వచ్చిన సంగతి తెలిసిందే. క్రీడలు జరిగే స్డేడియంలో ప్రేక్షకులు ఎవర్నీ అనుమతించడం లేదు. అంతేకాదు, క్రీడాకారులు నివశించే ప్రాంతాల్లోకి కూడా ఎవర్నీ అనుతించడం లేదు. క్రీడాకారులకు కావాల్సిన బట్టలు, ఇతర వస్తువులు, ఆహారం అన్నింటిని రోబోలే అందిస్తున్నాయి. Read: వీడేం…
ప్రపంచంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, జీరో కరోనా దేశంగా ఆవిర్భవించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నది. కరోనా కేసులు బయటపడుతున్న చోట కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నది. ఇప్పటికే మూడు నగరాలలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఒలింపిక్స్ ప్రారంభమయ్యే నాటికి ఎలాగైనా వైరస్‌ను కట్టడి…
తమిళ హీరో మాధవన్ కుమారుడు తండ్రికి తగ్గ తనయుడిగా సత్తా చాటుతున్నాడు. తండ్రి సినిమాల ద్వారా పేరు తెచ్చుకుంటే… తనయుడు స్విమ్మింగ్ ద్వారా ఖ్యాతి సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే… హీరో మాధవన్ తనయుడు వేదాంత్‌కు చిన్ననాటి నుంచే స్విమ్మింగ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని స్విమ్మింగ్‌లో రాణిస్తున్నాడు. ఇటీవల నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లో వేదాంత్ 7 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో త్వరలో ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనాలని భావిస్తున్నాడు.…
ప్రపంచం లో ఫుట్ బాల్ తర్వాత అంత క్రేజ్ ఉన్న ఆట అంటే క్రికెట్. అయితే అటువంటి క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చాలి అని కామెంట్స్ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఈ వ్యాఖ్యలను సమర్ధించాడు. ప్రస్తుతం అబుదాబి లో జరుగుతున్న టీ 10 లీగ్ లో ఢిల్లీ బుల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న… మోర్గాన్ ఒలంపిక్స్ లో టీ10 ఫార్మాట్ క్రికెట్ ను చేర్చాలి అని అన్నారు.…
ప్రధాని మోడి ఈరోజు ఉదయం పారాఒలింపిక్స్ లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులతో సమావేశం అయ్యారు. పతకాలు సాధించిన వారికి ట్రీట్ ఇచ్చారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. క్రీడకలకు అంగవైకల్యం అడ్డుకాదని, దీనికి ఉదాహరణ పతకాలు సాధించిన క్రీడాకారులే అని ప్రధాని మోడీ ఈ సందర్బంగా పేర్కొన్నారు. పతకాలు సాధించిన ప్రతి ఒక్కరిని ప్రధాని పలకరించారు. ప్రధానిని కలిసినందుకు క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. Read: తాలిబన్ల విజయం వారికి మరింత బలాన్నిస్తుందా…?
ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు నిత్యం ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబంతో గడిపేందుకు కూడా వారికి సమయం దొరకదు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ పాలన విషయంలో నిత్యం బిజీగా ఉండే పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ బుధవారం రోజుజ గరిటె పట్టాడు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వయంగా రకరకాల వంటలు చేశారు. మటన్…
ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో ఇండియా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనను కనబరిచిన సంగతి తెలిసిందే. దాదాపు 40 సంవత్సరాల తరువాత భారత హాకీ టీమ్ ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించింది. జర్మనీని ఓడించి కాంస్యపతకాన్ని సొంతం చేసుకుంది. 40 ఏళ్ల తరువాత హాకీ టీమ్ జట్టు పతకం సాధించడంతో దేశంలోని ప్రభుత్వాలు వారిని ఘనంగా సన్మానిస్తున్నాయి. అయితే, పంజాబ్ ప్రభుత్వం ఒ అడుగు ముందుకువేసి వారి ఘనత చిరస్తాయిగా నిలిచిపోయేందుకు వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. పతకం సాధించిన…
ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో ఆ మహిళ జావెలింగ్ త్రో విభాగంలో రజత పతకం సాధించింది. పతకం తీసుకొని ఆనందంతో తిరిగి పోలెండ్ వెళ్లిన ఆ మహిళా అథ్లెట్ ముందు ఓ సమస్య కనిపించింది. ఓ చిన్నారి ఆరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. ఆ చిన్నారి వైద్యంకు అయ్యేంత డబ్బు తనవద్దలేదు. వెంటనే తాను గెలుచుకున్న ఒలింపిక్ మెడల్‌ను వేలానికి ఉంచాలని నిర్ణయం తీసుకున్నది. ఆ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. ఆ అథ్లెట్ తీసుకున్న…