ఒలింపిక్స్ పాల్గొంటే చాలని క్రీడాకారులంతా కలలు కంటూ ఉంటారు. పతకం గెలవకపోయినా ఈ క్రీడల్లో పాల్గొంటే చాలని అహర్నశలు కష్టపడుతుంటారు. అయితే ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హఫీజ్ మాత్రం మరో అడుగు ముందు కేసింది. ఏడు నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగింది. ఈజిప్ట్‌కి చెందిన ఫెన్సర్ నాడా హఫీజ్(26), 7 నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ పడింది..
పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణంపై గురిపెట్టిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్‌లో చైనా బాక్సర్ వు హు చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్స్‌లో నిఖత్ పతక ఆశలు ఆవిరయ్యాయి.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లో కూడా బెల్జియం భారత్‌ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత్‌ను ఓడించింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇమాన్యుయేల్ మక్రాన్ ‘‘ముద్దు’’ వివాదంలో ఇరుక్కున్నారు. ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్రెంచ్ క్రీడా మంత్రి అమేలీ ఓడియా-కాస్టెరాని ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. అధ్యక్షుడు మక్రాన్ మెడపై చేయి వేసి కిస్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారానికి దారి తీసింది.
పారిస్ ఒలింపిక్స్‌లో రెండవ రోజు ఆదివారం (జులై 28) భారతదేశం పతక ఖాతా తెరిచింది. షూటింగ్‌లో స్టార్ షూటర్ మను భాకర్ కాంస్యం సాధించి భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.
భారత బాక్సర్ ప్రీతీ పవార్ వియత్నాంకు చెందిన వో థి కిమ్ అన్‌ను ఓడించి పారిస్ ఒలింపిక్స్ మహిళల 54 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ తొలిసారిగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 5-0తో గెలిచి బాక్సింగ్‌లో భారత్ ప్రచారానికి శుభారంభం ఇచ్చింది.
పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ 2024 ప్రారంభం అయ్యాయి. జులై 25న ఒలింపిక్ క్రీడలు మొదలు కాగా.. మరునాడు గేమ్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌ను అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిన 40 ఏళ్ల రష్యా వ్యక్తిని ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తిని ముందస్తు నిర్బంధంలో ఉంచారు. నేరం రుజువైతే 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు.
ఒలంపిక్స్ 2024 పారిస్ నగరంగా జరగబోతున్న ఈ మెగా ఈవెంట్లో భారత్ నుండి పురుషుల బాక్సింగ్ అర్హత పోటీల్లో భారతదేశానికి చెందిన నిశాంత్ దేవ్ స్థానాన్ని కన్ఫామ్ చేసుకున్నాడు. భారత యువ బాక్సర్ నిశాంత్ దేవ్ బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ అర్హత పోటీలలో క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించి ప్రతిష్టాత్మక పారిస్ ఒలంపిక్స్ బెడుతును కైవసం చేసుకున్నాడు. దీంతో ప్యారిస్ ఒలంపిక్స్ 2024 బాక్సింగ్ నుండి పురుషులలో మొదటి ఎంట్రీ నమోదయింది. Road Accident…
లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఆడే క్రికెట్‌లో చాలా మంది స్టార్ ఇండియన్ క్రికెటర్లు పాల్గొనలేరు. 2028 నాటికి.. చాలా మంది ఇండియా ఆటగాళ్ల వయస్సు రిటైర్మెంట్ లేదా రిటైర్మెంట్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత స్టార్ ఆటగాళ్లు ఆడటం చాలా కష్టం. ప్రస్తుతం.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 36 సంవత్సరాలు ఉండగా.. 2028 ఒలింపిక్స్ నాటికి అతని వయస్సు 41 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే…