టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. గత ఒలింపిక్స్‌లో కంటే ఈసారి మన ఆటగాళ్లు రాణిస్తున్నారని చెప్పొచ్చు. 1980లో రష్యాలో జరిగిన మాస్కో ఒలింపిక్స్ తరువాత 2021లో జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌కు చేరుకుంది. సెమీస్ లో ఓడిపోయినప్పటికీ మంచి ఆటను ప్రదర్శించి భవిష్యత్తులో జాతీయ క్రీడకు తిరిగి పునర్వైభవం రానుందని చెప్పకనే చెప్పారు. ఇక, మహిళల హాకీ జట్టు సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సెమీస్‌లో అర్జెంటైనాతో తలపడనున్నది. ఇక, మహిళా బాక్సర్ లవ్లీవా కాసేట్లో సెమీస్ గేమ్ ఆడబోతున్నది. రెజ్లింగ్‌లో రవికుమార్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా, నీరజ్ చోప్రా జావెలింగ్ త్రోలో ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఇక ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్ కేటగిరిలో చాను రజతం గెలుచుకోగా, షటిల్ గేమ్‌లో పీవీ సింధు కాంస్యం గెలుచుకున్నారు.
Read: ఇండియా కరోనా అప్డేట్: మళ్లీ భారీగా పెరిగిన కేసులు