ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో ఆ మహిళ జావెలింగ్ త్రో విభాగంలో రజత పతకం సాధించింది. పతకం తీసుకొని ఆనందంతో తిరిగి పోలెండ్ వెళ్లిన ఆ మహిళా అథ్లెట్ ముందు ఓ సమస్య కనిపించింది. ఓ చిన్నారి ఆరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. ఆ చిన్నారి వైద్యంకు అయ్యేంత డబ్బు తనవద్దలేదు. వెంటనే తాను గెలుచుకున్న ఒలింపిక్ మెడల్‌ను వేలానికి ఉంచాలని నిర్ణయం తీసుకున్నది. ఆ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. ఆ అథ్లెట్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ చాలా మంది విరాళాల రూపంలో ఆమెకు సహాయం చేశారు. అలా 1.26 లక్షల డాలర్లు వసూలయ్యాయి. ఇక, ఒలింపిక్ మెడల్ ను వేలం వేసేందుకు పోలెండ్ కు చెందిన సూపర్ మార్కెట్ చెయిన్ సంస్థ జాబ్కా ముందుకు వచ్చింది. వేలం వేసేందుకు అవకాశం పొందింది. అయితే, వేలంలో వచ్చిన డబ్బును ఆమెకు అందివ్వడమే కాకుండా, మంచి పనికోసం మెడల్‌ను వేలం వేస్తుండటంతో, ఆ మెడల్‌ను కూడా సంస్థ తిరిగి ఇచ్చేసింది. ఒకప్పుడు ఈ అథ్లెట్ మరియా అండ్రెజెక్ క్యాన్సర్ వ్యాధితో బాధపడింది. సంకల్పంతో క్యాన్సర్ నుంచి బయటపడి అథ్లెటిక్స్‌లో రాణించింది. గతంలో రియో ఒలింపిక్స్‌లో తృటిలో పతకాన్ని చేజార్చుకుంది మరియా.
Read: కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల ఆందోళన… ఎందుకంటే…