Hyderabad: మొహర్రం ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
భాగ్యలక్ష్మీ ఆలయం దగ్గర మీటింగ్ పెట్టే దమ్ము ఎవరికుంది.. కాంగ్రెస్ కు లేదు, బీఆర్ఎస్ కు లేదు.. ఈ రెండు పార్టీలు నమాజ్ చేసి అక్కడ సభలు పెడుతాయి కావచ్చు.. కానీ బీజేపీ భాగ్యలక్ష్మీ అమ్మవారికి మొక్కి సభ పెట్టింది అని ఆయన అన్నారు. అది చార్మినార్ కాదు.. భాగ్యలక్ష్మీ అమ్మవారు కొలువైన భాగ్యనగరం.. పాత బస్తీ మీది కాదురా.. మాదేరా.. ఏ బస్తీ అయినా మాదేరా.. ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపునా లాల్ దర్వాజ్ సింహావాహిని అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయానికి వచ్చారు. గోల్కొండ బోనాలతో మొదలైన బోనాలు సికింద్రాబాద్ లో ఇప్పుడు లాల్ దర్వాజ్ జరుపుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోడానికి తెల్లవారు జామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. లాల్‌దర్వాజా బోనాల పండగా సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఎంఐఎం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. బార్కాస్ సలాల లో ఇవాళ (శనివారం) ఓవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాటి ఘటనలో క్షతగాత్రుడిగా ఉన్న తనను ప్రాణాలకు తెగించి కాపాడిన ఎమ్మెల్యే బలాల, మజ్లీస్ కార్యకర్తలకు ఊపిరున్నంత వరకు రుణపడి ఉంటానన్నారు.
ప్రతీ సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేయడం ఆనవాయితిగా పెట్టుకున్నాము అని మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు తొమ్మిది సంవత్సరాల రిపోర్ట్ ను విడుదల చేశాము అని ఆయన పేర్కొన్నారు. ఇది సమగ్రమైన నివేదిక.. హైదరాబాద్, తెలంగాణలోని మున్సిపాలిటిలు బాగా పని చేస్తున్నాయి అనడానికి మాకు కేంద్రం నుంచి వచ్చిన అవార్డులే నిదర్శనం అని కేటీఆర్ అన్నారు.
Rangoli: వాకిట్లో వేసిన ముగ్గులు వేయడం సహజం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంటి ముందు ముగ్గులు వేస్తే.. శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు.
బక్రీద్ పండుగను పురస్కరించుకుని రేపు మీరాలం ఈద్గాలో నిర్వహించనున్న సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మీరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను ప్రార్థనలు ముగిసేంత వరకు దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి.
Gun firing: హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ లో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఇరువర్గాల మధ్య సివిల్ వివాదం చెలరేగింది. ఇరువర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో మసూద్ అలీ అనే న్యాయవాది లైసెన్స్ డ్ గన్ తో గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Fire accident: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వరుస అగ్నిప్రమాదాలు నగరవాసులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ హైదరాబాద్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.