ప్రతీ సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేయడం ఆనవాయితిగా పెట్టుకున్నాము అని మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు తొమ్మిది సంవత్సరాల రిపోర్ట్ ను విడుదల చేశాము అని ఆయన పేర్కొన్నారు. ఇది సమగ్రమైన నివేదిక.. హైదరాబాద్, తెలంగాణలోని మున్సిపాలిటిలు బాగా పని చేస్తున్నాయి అనడానికి మాకు కేంద్రం నుంచి వచ్చిన అవార్డులే నిదర్శనం అని కేటీఆర్ అన్నారు. నూతన మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చి ఇంత అబివృద్దికి సీఎం కేసీఆర్ గారి కృషియే కారణమన్నారు.
Read Also: Sai Chand Son: కంటతడి పెట్టిస్తున్న సాయిచంద్ కుమారుడి ఫోటో!
గత తొమ్మిది సంవత్సరాలలో 1,21,294 కోట్లు ఖర్చు చేసాము.. గత ప్రభుత్వాలు మున్సిపటీల కోసం 26 వేల 211కోట్లు ఖర్చు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 91.8 శాతం స్టేట్ గవర్నమెంట్ నుంచి ఖర్చు చేస్తే, 9,934 కొట్లు మాత్రమే కేంద్రం నిధులిచ్చింది అని ఆయన వెల్లడించారు. 2004 నుంచి 2014 వరకు రూ. 4, 636 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. 44 వేల కోట్లు జీహెచ్ఎంసీ కోసం రూ. 18 వేల కోట్లు వాటర్ కోసం ఖర్చు చేశామన్నారు. బల్దియాలో ఎన్నో కొత్త ఆలోచనలు చేసాము.. గతంతో పోలిస్తే.. ఇప్పుడు గుణాత్మకమైన మార్పు సాధించాము అని కేటీఆర్ అన్నారు.
Read Also: Actor Suman: మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుంది.. జగన్ మళ్లీ సీఎం అవుతారు
రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో టెండర్ దశలో ఉంది అని ఆయన పేర్కొన్నారు. హెచ్ఆర్డీసీఎల్ ద్వారా లింక్ రోడ్స్ ఏర్పాటు చేసాము.. మెయిన్ రోడ్స్ మంచిగా ఉండాలని సీఆర్ఎంపీని తీసుకుని వచ్చామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రోడ్లు బాగైనాయి.. బాంబే కూడా మన సీఆర్ఎంపినీ ఆదర్శంగా తీసుకొని అక్కడ టేకప్ చేస్తున్నారు. రాష్ట్రంలో 20 వేల లీటర్ల మంచి నీటిని ప్రతి ఇంటికి అందించాము అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ వరకు 100 శాతం మురుగును శుద్ది చేసిన నగరంగా హైదరాబాద్ ను నిలుపుతాం. 2024 వరకు చెత్త ద్వారా 101 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాము.. రూ. 261 కోట్లతో లిచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నాము.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఎఫ్ఎస్ టీపీలను ఏర్పాటు చేసుకున్నాము అని మంత్రి చెప్పుకొచ్చారు.
Read Also: Ram Charan: రామ్ చరణ్ ఖాతాలోకి మరో బ్రాండ్..
రాష్ట్రానికి 50 శాతం ఆదాయం పట్టణాల నుంచి వస్తుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. అభివృద్ధి కోసం పెట్టే ఖర్చు అప్పు కాదు, అది ఆ నగర భవిష్యత్తు పెట్టుబడి.. ప్రతీ చోట మార్పు స్పష్టంగా కనబడుతుంది.. మన నగరాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలి.. 2014లో నగరం ఎలా ఉంది ఇప్పుడు ఎలావుందీ అనేది చూడండి.. రెండు స్కై వేల కోసం రక్షణ శాఖ భూములను ఇవ్వమని ఇప్పటి వరకు ఐదుగురు రక్షణ మంత్రులను అడిగాము.. 150 ఎకరాల భూమి అవసరం.. పాతబస్తీ మెట్రోను ఎల్ అండ్ టినీ పూర్తి చేయకపోయినా.. మేమే దాన్ని నిర్మిస్తాం.. మెట్రో కోచ్ లను పెంచాలని ఎల్ అండ్ టిని కోరాము.. మెట్రో, ఆర్టీసీ, ఆటోలు, ఉబర్ అన్నింటినీ అనుసంధానం చేస్తూ కార్డు తేవాల్సిన అవసరం ఉంది అని మంత్రి కేటీఆర్ అన్నారు.