హైదరాబాద్ పాతబస్తీ.. బిజీబిజీగా ఉండే రోడ్డులో అకస్మాత్తుగా ఓ ఆటో నిలిచిపోయింది. ఫస్ట్ డ్రైవర్ పరుగులు పెట్టాడు. అంతలోనే ఆటో వెనుక వెహికిల్స్ కూడా వాటిని వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని.. అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
పాతబస్తీలో బైక్ రేసర్లు రోడ్డుపై వీరంగం సృష్టించారు. బైక్ రేసింగ్ చేస్తున్న పోకిరీలను అడ్డుకున్న యువకుడిపై దారుణానికి పాల్పడ్డాడు. బైక్ రేసర్లంతా ఏకమై యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన పాత బస్తీలోని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పాతబస్తీలో నకిలీ నోట్ల దందా సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో అలర్ట్ అయిన పోలీసులు ఈ విషయంపై నిఘా ఉంచారు. నకిలీ నోట్లు మారుస్తున్నారని తెలుసుకుని ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. కాగా..ఈ దాడుల్లో రూ. 30 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
భాగ్యనగరంలో పాతబస్తీ గొడవలకు అడ్డాగా మారుతోంది. ఏచిన్న విషయంలో అయినా సరే మాట మాట పెరిగి ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న విషయాలకు కత్తులు, తల్వార్లతో దాడిచేసుకోవడం నగరవాసులకు భాయభ్రాంతులకు గురిచేస్తుంది.
నకిలీ బాబాకేసు భాగ్యనగరంలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈఘటన రాష్ట్రంలోనే హాట్ టాపిక్. ఎన్జీవో ఆపరేషన్ ఎంట్రీతో పాతబస్తీ చర్చనీయాంశంగా మారింది. నకిలీ బాబా మహిళలపై చేస్తున్న అరాచకాలకు తెరదించింది. అయితే పాతబస్తీ బాబా కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.
భాగ్యనగరంలోని పాతబస్తీ బహదూర్ పురా స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఎన్‌ఎం గూడ అంబేద్కర్ విగ్రహం వద్ద పార్కింగ్ లో వున్న బస్సులో మంటలు చెలరేగాయి. అయితే మంటలు షార్ట్ షర్క్యూట్ వల్లే ఫైర్ అయ్యనట్లు సమాచారం.
పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ప్రేమించిన అమ్మాయి పెళ్లికి దూరం అవుతుందన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓల్డ్ సిటీలోని కలాపట్టర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహ్మద్ తబ్రేజ్ అలీ, స్థానికంగా ఉండే అమ్మాయితో ప్రేమించికున్నారు. ఇద్దరి ఇళ్లలో పెళ్లికి ఒప్పుకున్నారు.
High alert in Old City: ఇవాళ శుక్రవారం కావడంతో చార్మిన్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా ఆర్ ఏఎఫ్ పోలీసుల బలగాలను మోహరించారు. నేడు శుక్రవారం కావడంతో.. ముస్లీంలు మక్కామసీదు ప్రార్థనలకు రానున్నారు. ఈనేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం వున్నందున పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పాతబస్తీలో భద్రతను మరింత పెంచారు. ఇవాళ శుక్రవారం కావడంతో చార్మినార్, మక్కామసీదు పరిసరాల్లో…
రాజాసింగ్ పై కేసు నమోదు చేసి, జైలుకు పంపాల్సిందే అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఇటీవలే రాజా సింగ్ విడుదల చేసిన విడియో రిలీజ్ చేయడం వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా సింగ్ మహుమద్ ప్రవక్తపై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. దానీ ప్రభావంవల్లే ఇప్పుడు పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తాయని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉండేదని, ఇప్పుడు…
నేడు ఉదయం చారిత్రాత్మక చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లతో కలిసి సందర్శించారు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మి దేవాలయ ట్రస్టీ చైర్మన్ శశికళ ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రో చ్చారణల నడుమ పూర్ణకుంభంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మ వారి మహా…