Gun Firing: పాతబస్తీలో గన్ ఫైరింగ్.. సివిల్ వివాదంలో ఇరువర్గాల మధ్య గొడవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun firing: హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ లో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఇరువర్గాల మధ్య సివిల్ వివాదం చెలరేగింది. ఇరువర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో మసూద్ అలీ అనే న్యాయవాది లైసెన్స్ డ్ గన్ తో గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పాతబస్తీలోని మీర్ చౌక్ లో కొద్ది రోజుల క్రితం అర్ఫాత్ అనే వ్యక్తి ఇల్లు కొన్నాడు. అయితే ఆ ఇంటి విషయంలో గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. కోర్టులో కేసు ఉండగా ఇల్లు ఎలా కొనాలని పక్క ఇంటి వారు గొడవకు దిగారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తాజాగా ఈ విషయంపై అర్ఫాత్ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో గత అర్ధరాత్రి మసూద్ అలీ, మోర్ఖుజా తదితరులు అర్ఫాత్ తో గొడవపడ్డారు. వారిని భయపెట్టేందుకు తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు.
Also Read
ఈ ఘటనలో ఇరువర్గాల వారు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. మహిళలు కూడా కర్రలు పట్టుకుని మాటల యుద్ధానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Conflict Between Tigers: ఆధిపత్యం కోసం రెండు పులుల మధ్య యుద్ధం.. ఒకటి మృతి
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!