ఢిల్లీలో మరో 80 వేల మంది వృద్ధులకు నెలకు రూ.2000 పెన్షన్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇందుకోసం 24 గంటల్లోనే 10 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా పింఛను ప్రారంభించాలని వృద్ధులు కోరేవారని కేజ్రీవాల్ చెప్పారు.
పెన్షనర్లకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పెన్షన్‌ను దశల వారీగా పెంచుతామని, మొత్తం రూ. 3,000 అందిస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఆ హామీ మేరకు ఏటా రూ. 250 చొప్పున పెన్షన్‌ను పెంచుతూ వస్తున్నారు.. అందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. పాత లబ్దిదారులే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2.31 లక్షల మందికి కూడా పెన్షన్ మంజూరు చేసింది సర్కార్.. ఆదివారం…
వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. వయోపరిమితిని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించింది సర్కార్.. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును 65 ఏండ్ల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసింది.. ఇకపై అర్హులైన 57 ఏళ్ల వారందరికీ కొత్త పెన్షన్లు అందనున్నాయి. వెంటనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను…
చిత్తూరులో వ్యాక్సిన్ వేసుకుంటేనే వృద్ధాప్య పింఛన్ అని ఓ వాలంటీర్ కొత్త రూల్ తెచ్చాడు. కుప్పం మం.పైపాల్యం గ్రామ సచివాలయంలో పని చేస్తున్నా సతీష్ వాలంటీర్ నిర్వాకం ఇది. బాధితుడు కుప్పచిన్న స్వామికి మూడోసారి వ్యాక్సిన్ వేయించాడు వాలంటీర్. వ్యాక్సిన్ వేసుకుంటేనే వృద్ధాప్య పింఛన్ అన్నందుకు విధిలేక వేసుకున్నాడు బాధితుడు. ఇప్పటికే నాకు రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పినా వాలంటీర్ పట్టించుకోలేదు అని తెలిపాడు. వైద్య సిబ్బంది చేత వ్యాక్సినేషన్ వేయించి పింఛన్ ఇచ్చారు…