చిత్తూరులో వ్యాక్సిన్ వేసుకుంటేనే వృద్ధాప్య పింఛన్ అని ఓ వాలంటీర్ కొత్త రూల్ తెచ్చాడు. కుప్పం మం.పైపాల్యం గ్రామ సచివాలయంలో పని చేస్తున్నా సతీష్ వాలంటీర్ నిర్వాకం ఇది. బాధితుడు కుప్పచిన్న స్వామికి మూడోసారి వ్యాక్సిన్ వేయించాడు వాలంటీర్. వ్యాక్సిన్ వేసుకుంటేనే వృద్ధాప్య పింఛన్ అన్నందుకు విధిలేక వేసుకున్నాడు బాధితుడు. ఇప్పటికే నాకు రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పినా వాలంటీర్ పట్టించుకోలేదు అని తెలిపాడు. వైద్య సిబ్బంది చేత వ్యాక్సినేషన్ వేయించి పింఛన్ ఇచ్చారు అని బాధితుడు తెలిపాడు. సంబంధిత వైద్య అధికారులు మరియు సచివాలయ అధికారులు సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేసాడు.