Off The Record: నాన్న దేవుడు… ఆయన చుట్టూనే దయ్యాలు చేరాయి. తెలంగాణ జాతిపిత కేసీఆర్….. అలాంటి మహా మనిషికి కాళేశ్వరం కమిషన్ నోటీస్‌లు ఇస్తుందా? హవ్వ… ఎంత ధైర్యం? మా నాయకుడికి నోటీస్‌లు ఇస్తే… పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? నిరసన తెలపకపోవడానికి రీజనేంటి? బీఆర్‌ఎమ్మెల్సీ కవిత లేటెస్ట్ మాటలివి. ఎంత గవర్నమెంట్ అయితే మాత్రం…. కేసీఆర్‌కు నోటీస్‌లు ఇస్తారా అంటూ… ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్న కవిత… అందుకు నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేశారు.
Read Also: Off The Record: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే సీన్ ఉందా..? అన్ని వట్టి మాటలేనా..?
బానే ఉంది… తండ్రి ఆత్మగౌరవం పేరుతో కూతురు ధర్నా చేయడం వరకు ఓకే. కానీ… ఇక్కడే తేడా కొట్టింది. లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. బీఆర్‌ఎస్ వరకు కేసీఆరే సుప్రీం. అందులో ఎవరికీ డౌట్స్ లేవు. ఇప్పటికిప్పుడు కాదనే దమ్ము, ధైర్యం ఆ పార్టీలో లేవు. అలాంటి కేసీఆర్‌కు మద్దతుగా కవిత ధర్నా చేస్తుంటే… అక్కడ ఒక్క గులాబీ జెండా కూడా ఎందుకు ఎగరలేదు? పార్టీ ముఖ్య నాయకులు మచ్చుకైనా ఎందుకు కనిపించలేదన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. గతంలో కవిత ఎప్పుడు కార్యక్రమాలు నిర్వహించినా… పోటా పోటీగా అటెండ్ అయి… హాజరేయించునే గులాబీ లీడర్స్ ఇప్పుడు ఆమెకు ఎందుకు ముఖం చాటేశారు? అంటే… కవిత జోలికి వెళ్ళవద్దని పార్టీ ఆదేశించిందా? లేక ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ నాయకులే కాస్త దూరం పాటిస్తున్నారా అన్న చర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. అటు ఆమె కూడా గులాబీ కండువా లేకుండానే ప్రోగ్రామ్‌ని ముగించేయడం ఇంకా సంచలనం అవుతోంది.
Read Also: RCB Stampede: మృతుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చిన సీఎం.. రూ.10 లక్షల సహాయం ప్రకటన..
కవిత ఇన్ని రోజులు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు. ఇప్పుడు నిర్వహించిన మహా ధర్నా మరో ఎత్తు. తెలంగాణ జాగృతి పేరుతో… వందల కార్యక్రమాలు చేశారామె. అలా నిర్వహించిన ప్రతి ప్రోగ్రామ్‌లో మద్దతుగా వెంట నడిచింది బీఆర్‌ఎస్ కేడర్. ఇంకా చెప్పాలంటే…. అక్కను నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు కార్యకర్తలు. కానీ… ఒక్క లెటర్… కవిత తండ్రికి రాసిన ఒకే ఒక్క లెటర్‌తో సీన్ మొత్తం మారిపోయింది. అసలు గులాబీ వాసనే లేకుండా ముగిసిపోయింది మహా ధర్నా. దీంతో… కవితను పార్టీ వద్దనుకుంటోందా? లేక ఆమే పార్టీకి దూరంగా ఉంటున్నారా అన్న చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో. కేసీఆర్‌కు రాసిన లేఖలో పరోక్షంగా తన అన్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని టార్గెట్ చేశారు కవిత. ఇప్పుడేమో… కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినా పార్టీ పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ… తండ్రి గౌరవాన్ని తానే నిలబెడతానంటూ ధర్నా చేశారు. అంటే ఆమె వ్యవహారం నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. కేసీఆర్ అంటే బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ అంటే కేసీఆర్. అలాంటి ఆయనకు మద్దతుగా చేసిన ధర్నాలో గులాబీ జెండాలు, కండువాలు పెట్టకపోవడమంటే… కవిత తనకు తానుగా పార్టీకి దూరం అవుతున్నారా? కేసీఆర్‌ని దేవుడని అంటూనే…. ఆయన మానసపుత్రిక బీఆర్‌ఎస్‌ని దూరం పెట్టడమంటే.. అది ధిక్కారం కాదా అన్నది కొందరి క్వశ్చన్.
Read Also: Andala Rakshasi: “అందాల రాక్షసి” మళ్ళీ వస్తోంది!
ఇన్నాళ్ళు కవిత ఏం మాట్లాడినా, లేఖలు రాసినా…. ఆమె ప్రయాణం మాత్రం బీఆర్‌ఎస్‌తోనే ఉంటుందని అనుకున్నారట ఎక్కువ మంది. కానీ… ఇందిరాపార్క్ ధర్నాను చూశాక మాత్రం తమ అంచనాలను సవరించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆమె బీఆర్‌ఎస్‌తో తెగదెంపులు చేసుకున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. కార్యక్రమంలో పార్టీ కేడర్ లేకపోవడం, కేవలం జాగృతి కార్యకర్తలే అంతా తామై నడిపించడం చూస్తుంటే… అగాధం బాగానే పెరిగినట్టు కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. దీంతో కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇప్పుడే కాదు… ఇక మీదట కూడా కవిత నిర్వహించే కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ కేడర్ హాజరవబోదా? ఎవరి దారి వారిదేనా? అసలు గులాబీ జెండా, అజెండా లేకుండా ఆమె నిలదొక్కుకోగలరా? కేసీఆర్ దేవుడని అంటూనే… బీఆర్‌ఎస్ కేడర్‌ని దూరం పెట్టడం ఏ తరహా రాజకీయం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.