Off The Record: తెలంగాణ కేబినెట్‌లో అందరికీ ఆయనే ఎందుకు టార్గెట్ అయ్యారు? స్వయంకృతమా? లేక వేరే కారణాలేమన్నా ఉన్నాయా? కేబినెట్ సహచరుల్లో ఎక్కువ మందికి ఆయన తీరు నచ్చడం లేదా? వ్యవహారం చినికి చినికి గాలివానగా ఎందుకు మారుతోంది?
Read Also: Ahmedabad plane crash: DNA ద్వారా 163 మృతదేహాల గుర్తింపు.. 124 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత..!
తెలంగాణ మంత్రులు ఒకరిద్దరు మీడియా ముందు మాట్లాడుతున్న కొన్ని విషయాలు కాస్త రచ్చకు దారితీస్తున్నాయి. తమ శాఖలకు సంబంధం లేని విషయాల విషయాల గురించి కూడా కామెంట్స్ చేస్తుండటంతో.. మిగిలిన మంత్రులు నొచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్‌కు కూడా చెప్పుకున్నారట. ప్రభుత్వ పథకాలపై మంత్రుల కామెంట్స్‌తో చాలా రోజులుగా గందరగోళం పెరుగుతోంది. ప్రత్యేకించి రైతు రుణ మాఫీ వ్యవహారంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల ప్రకటనలే గందరగోళానికి దారితీశాయి అన్నది పార్టీలో ఓపెన్ టాక్. దీనికి ఎక్కడో ఒకచోట పుల్ స్టాప్ పెట్టాలని అప్పట్లో చర్చ జరిగింది. కానీ సీఎంకి సన్నిహితంగా ఉండే మంత్రులు అవ్వడంతో ఎవరు ఏం చెప్పలేకపోయారట. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదానికి దారితీశాయి.
Read Also: Allu Arjun : బన్నీ రిజెక్ట్ చేసిన రెండు భారీ మూవీలు..
ఇక, ఓవైపు కులగణన ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. కోర్టులో ఇంకా గ్రీన్ సిగ్నల్ రానేలేదు. ఈ పరిస్థితిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన అంశాలపై కామెంట్స్ చేయడం, దానిపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో.. రచ్చ మొదలైందని అంటున్నారు. ఒక క్లారిటీకి రాకముందే అలాంటి స్టేట్‌మెంట్స్ వల్ల బయటికి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయానికి అటు పీసీసీ చీఫ్ తో పాటు ఒకరిద్దరు మంత్రులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ భేటీ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చిందట. దాంతో పొంగులేటికి మహేష్ గౌడ్ ఫోన్ చేసి వివరణ తీసుకున్నట్టు సమాచారం. వేరే మంత్రుల శాఖలకు సంబంధించిన సబ్జెక్టు గురించి మీరెందుకు మాట్లాడుతున్నారని అడిగినట్టు పీసీసీ చీఫ్ అడిగినట్టు తెలుస్తోంది. ఒక శాఖకు సంబంధించిన వ్యవహారంపై వాళ్ళకు తెలియకుండా.. మరో మంత్రి ఎలా కామెంట్ చేస్తారంటూ.. ఓ క్యాబినెట్ మినిస్టర్ నేరుగా ముఖ్యమంత్రినే ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన మీకి సన్నిహితుడు కాబట్టి.. మీరే చెప్పి అలా మాట్లాడించి ఉంటారని అంతా అనుకుంటున్నట్టు సీఎం దృష్టికి తీసుకువెళ్ళారట సదరు మినిస్టర్. ఇంకో మంత్రి అయితే.. మేటర్‌ని డైరెక్ట్‌గా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్ళి.. అన్ని శాఖల గురించి పొంగులేటి శ్రీనివాసరెడ్డే ఎలా మాట్లాడతారని ప్రశ్నించినట్టు సమాచారం. తెలంగాణ కేబినెట్‌లోని చాలా మంది మంత్రుల్లో ఈ తరహా అసహనం ఉందట. మాకు సంబంధించిన అన్ని విషయాల గురించి ఆయనెలా మాట్లాడతారంటూ వాళ్ళంతా స్ననిహితులతో అంటున్నట్టు తెలుస్తోంది.
Read Also: Cataract: కంటిశుక్లం హానికరమా..? కాదా..?
అయితే, పొంగులేటి సీఎంతో అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల ముఖ్యమంత్రే ఆయనతో చెప్పి మాట్లాడిస్తున్నారన్న అనుమానంతో ఇన్నాళ్ళు గమ్ముగా ఉన్నారట చాలా మంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో రైతు రుణమాఫీపై ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల ప్రకటనలే పార్టీలో, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయన్నది ఓపెన్ టాక్. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువే కానీ.. ఇంకో మంత్రి విషయంలో జోక్యం చేసుకుంటే అది ఇద్దరి మధ్య రచ్చకు దారి తీసే ప్రమాదమే ఎక్కువ. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలను పొంగులేటి ముందే చెప్పటం, కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశంపై స్పష్టత లేకుండానే ప్రకటన ఇవ్వడంతో గందరగోళం పెంచి ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్టయిందన్నది పార్టీ పెద్దల అభిప్రాయం. స్థానిక సంస్థల ఎన్నికలపై సీతక్క కూడా మాట్లాడారంటూ… పొంగులేటి వర్గం సోషల్ మీడియాలో చర్చకు పెట్టింది. అయితే.. కేబినెట్ మీటింగ్ గురించి కానీ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన అంశాలను గాని తాను ఎక్కడా మాట్లాడలేదని మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు సీతక్క. మిగతా శాఖల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలన్న కోరిక పొంగులేటికి డైరెక్ట్‌గా ఉండి ఉండకపోవచ్చుగానీ.. సందర్భానుసారం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మిగతా సహచరులకు ఎక్కడో గుచ్చుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఆయన కూడా సంయమనం పాటిస్తే మంచిదన్న అభిప్రాయం పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.