అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమం నిర్వహిస్తోంది టీడీపీ. నెల రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించాలన్నది ప్రోగ్రామ్ లక్ష్యం.
ముతుకుమిల్లి శ్రీభరత్..... తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ. ఉద్దండులు గెలిచిన విశాఖ గడ్డ మీద రికార్డులు బ్రేక్ చేసిన నాయకుడు. రాజకీయ వారసత్వ పునాదుల ఆధారంగా 2019లో తొలిసారి పోటీ చేసిన శ్రీభరత్‌కు షాకింగ్ ఎక్స్పీరియన్స్ మిగిల్చారు విశాఖ ఓటర్లు. నాడు వైసీపీ ప్రభంజనం ఒకవైపు, జనసేన ఓట్లు చీలిక మరోకవైపు తీవ్ర ప్రభావం చూపి ఫస్ట్ అటెంప్ట్‌లో ఓడిపోయారాయన. అప్పట్లో... ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ గెలుపుకంటే... భరత్ ఓటమిపైనే ఎక్కువ విశ్లేషణలు నడిచాయి.…
టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ.. ఆధిపత్యం కోసం కాంగ్రెస్... రాజకీయ ఉనికి కోసం మళ్ళీ తెలుగుదేశంలోకి.... ఆపై ఢిల్లీలో పట్టుకోసం వైసీపీలోకి జంప్. ఇలా కాలమాన పరిస్థితులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు వ్యూహాలు, పార్టీలు మారుస్తూ... తన రాజకీయ ఉనికి చాటుకుంటుంటారు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతోంది బీజేపీ. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక... ఫస్ట్ టాస్క్ కాబట్టి... ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారట. అందుకే జిల్లాల పర్యటనలు మొదలుపెట్టినట్టు సమాచారం. మండల పార్టీ అధ్యక్షులకు వర్క్‌షాప్స్ పేరుతో పార్టీని సంస్థాగతంగా, రాజకీయంగా బలోపేతం చేసేందుకు శిక్షణ ఇస్తున్నారు. అయినా సరే.... పార్టీలో ఏదో... వెలితి కనిపిస్తూనే ఉందట. కారణం ఏంటంటే... నేతలు ఐక్యతా రాగం వినిపించడం లేదన్నది సమాధానం.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్... తన పదవికి రాజీనామా చేస్తారా..? అలా చేయాలనుకోవడం వెనక ఆయన స్కెచ్ ఏంటన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో లేటెస్ట్ హాట్ సబ్జెక్ట్. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన దానం.. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే... రాజీనామా చేయడమే బెటర్ అనుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. తాజాగా... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం తెర మీదకు రావడంతో.. నాగేందర్ మనసు అటువైపు మళ్ళినట్టు చెప్పుకుంటున్నారు.
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి రాజకీయం మండుతోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం తారా స్థాయికి చేరిపోయింది. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరుల దగ్గర మొదలైన గొడవ... చినికి చినికి గాలి వానాగా మారి ప్రకంపనలు రేపుతోంది.
రోజులో లొల్లితో కాంగ్రెస్ పెద్దలకు కూడా విసుగెత్తిందా..? ఏదోరకంగా ఆ నియోజకవర్గాన్ని సెట్ చేయాలని ముఖ్యమంత్రి కూడా డిసైడ్ అయ్యారా..? అందుకే అక్కడ అలా మాట్లాడారా? పద్ధతి మార్చుకోవాలని డైరెక్ట్‌గా లోకల్ ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చేసినట్టేనా? ఆయన అవకుంటే… మీరే సెట్ చేయండని పీసీసీకి కూడా సీఎం చెప్పిన ఆ నియోజకవర్గం ఏది? ఆ ఎమ్మెల్యే ఎవరు? తుంగతుర్తి నియోజక వర్గం వేదికగా… రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన,…
సత్యవేడు పేరు వింటేనే... టీడీపీలో షేకవుతోందట. ఈ నియోజకవర్గంలోని వ్యవహారాలను చూసి... జిల్లా నేతలతో పాటు... పార్టీ పెద్దలు సైతం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన కోనేటి ఆదిమూలంకు పార్టీ టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. ఇష్టం లేకపోయినా.... అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నేతలంతా కలిసి ఆయన్ని గెలిపించుకున్నారు.